తెలంగాణ పత్రిక చీఫ్ ఎడిటర్‌గా రామమోహన్

25 Oct, 2014 02:21 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని రానున్న ‘తెలంగాణ’ జర్నల్‌కు చీఫ్ ఎడిటర్‌గా అష్టకళ రామమోహన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాదిపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.   సిబ్బందిని సమాచార, పౌర సంబంధాల శాఖ నియమించుకోవాలని సమాచార శాఖ కార్యదర్శి ఆర్వీ చంద్రవదన్ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
 శిక్షణపై చంద్రవదన్: వారంపాటు శిక్షణ కోసం హర్యానాలోని సోనెపట్‌కు కార్మికశాఖ కార్యదర్శి, సమాచారశాఖ కమిషనర్ చంద్రవదన్ వెళ్తున్నారు. ఆయన స్థానంలో ఈ బాధ్యతలను పౌరసరఫరాలశాఖ కమిషనర్ పార్థసారథి నిర్వహిస్తారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శుక్రవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా