ప్రజాసంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం

10 Dec, 2014 03:04 IST|Sakshi

సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్

అశ్వాపురం : ప్రజాసంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని, పాలన పగ్గాలు చేపట్టి ఆరు నెలలు దాటినా కూడా ఏ ఒక్క విషయంలోనూ పురోగతి లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ విమర్శించారు. సీపీఎం పినపాక డివిజన్ మహాసభ ముగింపు స్థానిక వర్తక సంఘం కల్యాణ మండపంలో మంగవారం ముగిసింది. ముగింపు సమావేశంలో పోతినేని మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందని విమర్శించారు.

సర్వేల పేరుతో కాలయాపనే తప్ప సాధించేదేమీ లేదన్నారు. కాంట్రాక్ట్ కార్మికులందరిని క్రమబద్ధీకరిస్తామన్న ఎన్నికల హామీని కేసీఆర్ విస్మరించాని విమర్శిచారు. ప్రజాసంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. నరేంద్ర మోడి ప్రభుత్వం బహుళజాతి కంపెనీలకు అధిక ప్రాధాన్యమిస్తోందని, ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని విమర్శించారు. కార్మిక చట్టాల సవరణ పేరుతో కార్మికులకు అన్యాయం చేసేందుకు యత్నిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మహాసభలో రాష్ట్ర నాయకుడు కాసాని ఐలయ్య, డివిజన్ కార్యదర్శి అన్నవరపు కనకయ్య, నాయకులు మధు, కాటేబోయిన నాగేశ్వరరావు, సర్గం బాలనర్సయ్య, పాయం భద్రయ్య, బీరం శ్రీనివాస్, సున్నం రాంబాబు, నిమ్మల వెంకన్న, గద్దల శ్రీనివాసరావు, సరోజిని తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు