వికలాంగుల సమస్యల పరిష్కారానికి కేసీఆర్ హామీ

19 May, 2014 02:39 IST|Sakshi
వికలాంగుల సమస్యల పరిష్కారానికి కేసీఆర్ హామీ

 నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్: వికలాంగుల సమస్యల పరిష్కారానికి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారని  డ్వాబ్ ప్రధాన కార్యదర్శి పోనుగోటి చొక్కారావు ఆదివారం తెలిపారు. డెవలప్‌మెంట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ది బ్లైండ్ (డ్వాబ్) ఆధ్వర్యంలో శనివారం రాత్రి హైదరాబాద్‌లో కేసీఆర్, హరీష్‌రావు, కేటీఆర్, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డిలను కలిసి శుభాకాంక్షలు తెలిపినట్లు పేర్కొన్నారు. అంధుల పాఠశాలను ప్రభుత్వపరం చేయడం, రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇప్పించాలని కోరినట్లు తెలిపారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో ఎ.రంగారావు, కె.శుభాష్, కె.శ్రీనివాస్, బి.ఎల్. రెడ్డి, ఎన్.వెంకట్‌రెడ్డి, అలుగుబెల్లి పాపిరెడ్డి  తదితరులు పాల్గొన్నారు.
 
 వృత్తివిద్యా కోర్సులను పునరుద్ధరించాలని వినతి
 రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో వృత్తివిద్యా కోర్సులను పునరుద్ధరించాలని ప్యారామెడికల్ కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్ శాసనాసభా పక్ష నేతగా ఎన్నికైన కె.చంద్రశేఖర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. గత సంవత్సరం వరకు జూనియర్ కాలేజీల్లో నిర్వహిస్తున్న ఈ కోర్సులను ప్రభుత్వం రద్దు చేయడం వల్ల విద్యార్థులు చదువుకోలేక, అధ్యాపకులు ఉపాధి లేక రోడ్డునపడ్డారని వివరించారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో సంఘం అధ్యక్షుడు విజయ్‌కుమార్, కలిమ్, నాగరాజు, గోపాలకృష్ణ తదితరులున్నారు.

>
మరిన్ని వార్తలు