సమయానికి రండి

14 May, 2015 01:59 IST|Sakshi
సమయానికి రండి

నిజామాబాద్ అర్బన్ : జిల్లా కేంద్రంలో గురువారం జరిగే ఎంసెట్‌కు విద్యార్థులు సమయూనికి హాజరు కావాలని అధికారులు సూచించారు. కనీసం గంట ముందు గా పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని పేర్కొన్నారు. ఒక్క నిమిషం ఆలస్యమై నా పరీక్షకు అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాలలో తగిన వసతులు కల్పి ంచామని, రవాణా సౌకర్యం కూడా ఉంటుందని వివరించారు. ఇంజి నీరింగ్ పరీక్ష కోసం 17, మెడిసిన్‌కు 8 సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇంజినీరింగ్ పరీక్ష ఉదయం పది గంటల నుంచి పగలు ఒంటిగంట వరకు,మెడిసిన్ పరీక్ష పగలు 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ఉంటుంది. దూరప్రాంత విద్యార్థులకు వసతిని ఏర్పాటు చేశారు. కొందరు బుధవారం మధ్యాహ్నం వరకే వసతి కేంద్రాలకు చేరుకున్నారు. కాకతీయ జూనియర్ కళాశాలలోని విద్యార్థినీ, విద్యార్థులకు వేరువేరుగా వసతి కల్పించడంతో తల్లిదండ్రులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ తాగునీరుతోపాటు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నారుు. ఆర్‌టీసీ, రవాణా శాఖ అధికారులు ప్రత్యేక ఏ ర్పాట్లను చేస్తున్నారు.
 
ఒక్క విద్యార్థికి కూడా ఇబ్బంది కలుగకూడదు

ఎంసెట్ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. బు దవారం ఆయన వరంగల్ నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒక్క విద్యార్థి ఉన్న సరే ఇబ్బం దులు పడకుండా సెంటర్‌కు వెళ్లే విధంగా తోడ్పాటునందించలన్నారు. మారుమూల ప్రాంతాల నుంచి విద్యార్థులను తీసుకురావడంపై ప్రధాన దృష్టిసారించాలన్నారు. ఆర్‌టీసీ కార్మికులు సమ్మె విరమించినా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తప్పనిసరిగా ఉ ండాలని సూచించారు. విద్యార్థులు ఒక పరీక్ష కేంద్రానికి బ దులు మరో పరీక్ష కేంద్రానికి వెళితే పోలీసు వాహనాల ద్వారా వారిని సెంటర్లకు పంపించాలన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి రాజీవ్‌శర్మ మాట్లాడుతూ బస్సులు బయలు దేరే సమయాలను విద్యార్థుల మొబైల్ నంబర్లకు ఎస్‌ఎంఎస్ చేయాలన్నారు. పోలీసు శాఖ అత్యంత బాధ్యతతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. బస్సులపై బ్యానర్లను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష అనంతరం బస్సులు మండలాల కేంద్రాలకు పంపించాల ని పేర్కొ న్నారు. కలెక్టర్ డి.రొనాల్డ్‌రోస్ మాట్లాడుతూ విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేందుకు 237బస్సులను ఏర్పాటు చేశామన్నారు. సందేహాలు తీర్చడానికి 18004256644 టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు జేసీ రాజారాం, ఎస్‌పీ చంద్రశేఖర్‌రెడ్డి, డీఆర్‌ఓ మనోహర్, డీటీసీ రాజా రత్నం, ఆర్‌టీసీ ఆర్‌ఎం రమాకాంత్, ఎంసెట్ కో-ఆర్డినేటర్ రాంమోహన్‌రావు  పాల్గొన్నారు.
 
 

మరిన్ని వార్తలు