క్రమబద్ధీకరణకు నేటితో ఆఖరు

28 Feb, 2015 06:47 IST|Sakshi
క్రమబద్ధీకరణకు నేటితో ఆఖరు

- చెల్లింపు కేటగిరీలో వచ్చిన దరఖాస్తులు 13వేలు
- గడువు పెంచే ప్రసక్తే లేదంటున్న అధికారులు

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన భూముల (ఇళ్ల స్థలాల) క్రమబద్ధీకరణ ప్రక్రియకు శనివారంతో గడువు ముగియనుంది. ఉచిత కేటగిరీలో దరఖాస్తు చేసుకునేందుకు గత నెల 31తోనే  గడువు ముగియగా, చెల్లింపు కేటగిరీలో దరఖాస్తులను శనివారం వరకే స్వీకరిస్తామని అధికారులు చె బుతున్నారు. ఆపై గ డువు పెంచే ప్రసక్తే లేదని, దరఖాస్తు చేసుకోనివారి నుంచి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటామని పలు జిల్లాల్లో కలెక్టర్లు హెచ్చరి కలు జారీచేశారు.

అయితే.. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణ యం తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ ప్రభుత్వం గడువు పెంచాలని అనుకున్నా.. ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అడ్డొస్తుందని అధికారులు అంటున్నారు. ఉచిత కేటగిరీలో 3.5 లక్షల దరఖాస్తులు రాగా, చెల్లింపు కేటగిరీలో శుక్రవారం వరకు 13,054 దరఖాస్తులు, రూ.71.01కోట్ల సొమ్ము ప్రభుత్వానికి అందినట్లు తెలిసింది.
 

మరిన్ని వార్తలు