ప్రమాదపుటంచున పర్యాటకులు

23 Aug, 2019 09:21 IST|Sakshi
ప్రాజెక్ట్‌ నీటి అంచున ఫొటోలు దిగుతున్న పర్యాటకులు

సాక్షి, బాల్కొండ (నిజామాబాద్‌): ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చే సమయంలో ప్రాజెక్ట్‌కు జలకళతో పాటు, జనకళ వస్తుంది. ప్రాజెక్ట్‌ సందర్శనకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. కాని ప్రాజెక్ట్‌ వద్ద పర్యాటకుల భద్రతను పట్టించుకునే నాథుడే కరువవడంతో పర్యాటకులు ప్రమాదపు అంచుకు వెళ్తున్నారు. అయిన ప్రాజెక్ట్‌ ఆనకట్టపై ఉన్న సబ్‌ కంట్రోల్‌ బూత్‌ పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

నీటి అంచున సెల్ఫీలు
పర్యాటకులు నీటి అంచు వరకు వెళ్లి సెల్ఫీలు దిగుతున్నారు. ప్రాజెక్ట్‌ లోపలి వైపు నీటి అంచు వరకు రివీట్‌మెంట్‌ మీద వెళ్లడం ప్రమాదకరం. దూర ప్రాంతాల నుంచి వస్తున్న పర్యాటకులకు తెలియక నేరుగా ప్రాజెక్ట్‌ నీటి అంచుకు వెళ్తున్నారు. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌ నుంచి  సందర్శనకు వచ్చిన ఇద్దరు యువకులు నీటిలో మునిగి మత్యువాత పడ్డారు. అయిన ప్రాజెక్ట్‌ వద్ద పర్యాటకుల కోసం ఎలాంటి భద్రత చర్యలు చేపట్టడం లేదు. ప్రాజెక్ట్‌ వద్ద ప్రమాదాలు జరగక ముంద చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

డ్యాం మీదకి అనుమతి లేదు
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ డ్యాంపైకి పర్యాటకులకు అనుమతివ్వడం లేదు. ఆనకట్టపై నుంచే ప్రాజెక్ట్‌ను సందర్శించి వెళ్లాలి. దీంతో ప్రాజెక్ట్‌ లోపకి వైపుకు దిగుతు గేట్లను చూస్తున్నారు. ప్రాజెక్ట్‌ వద్ద డ్యాంపైకి వెళ్లకుండ గేట్లను మూసి వేస్తున్నారు. కేవలం ఆదివారం మాత్రమే డ్యాంపైకి అనుమతిస్తున్నారు. డ్యాంపైకి వెళితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గేట్లు మూసి ఉంచుతున్నారు.

మరిన్ని వార్తలు