ట్రాన్‌‌సఫార్మర్ కష్టాలివీ

22 Feb, 2015 03:44 IST|Sakshi

విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. బెజ్జంకి మండలం గన్నేరువరం గ్రామ పంచాయతీ పరిధి చాకలివానిపల్లెలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పంటల పొలాల మధ్య ఉంది. కాలిపోరుున సందర్భంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దాన్ని రోడ్డు సమీపంలోకి తరలించాలని రైతులు ఎప్పటినుంచో అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. కానీ అధికారులు అన్నదాతల గోడు పట్టించుకోవడం లేదు.
 
 ఈ ఏడాది రైతులు మొక్కజొన్న పంట సాగుచేశారు. రెండురోజుల క్రితం ఆ ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయింది. దానిని బయటకు తీసుకురావడానికి పంటలు అడ్డొచ్చాయి. చేసేదేమీలేక చేతికొచ్చే పంట నష్టపోవాల్సి వచ్చినా.. చేనులోంచే ట్రాక్టర్‌ను తీసుకెళ్లి ట్రాన్స్‌ఫార్మర్‌ను శనివారం మరమ్మతుకు పంపించారు.
 

మరిన్ని వార్తలు