సిద్దిపేట.. ఆలయాల ఖిల్లా   

12 Aug, 2019 12:11 IST|Sakshi
 కేసీఆర్‌ గురువు మృత్యుంజయ శర్మ, గుణసుందరి  దంపతులను సన్మానిస్తున్న హరీశ్‌రావు

మన సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్‌కు అందించాలి

ఆదర్శ బ్రాహ్మణ దంపతులకు పురస్కార కార్యక్రమంలో 

మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు

సాక్షి, ప్రశాంత్‌నగర్‌: తూర్పున హుస్నాబాద్‌లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం, ఉత్తరాణ బెజ్జంకి శ్రీలక్ష్మీ నరసింహాస్వామి ఆలయం, అనంతసాగర్‌ శ్రీ సరస్వతిమాత ఆలయం, దక్షిణాన శ్రీ కొమురవెళ్లి మల్లన్న స్వామి ఆలయం, పడమరాన నాచారం శ్రీ లక్ష్మీ నరసింహా స్వామి ఆలయలతో పాటు జిల్లాలో కొండపోచమ్మ రిజర్వాయర్, మల్లన్న సాగర్, అనంతగిరి రిజర్వాయర్, రంగనాయకసాగర్, లద్నూర్‌ రిజర్వాయర్‌లతో జిల్లా దేవాలయాల ఖిల్లాగా, రిజర్వాయర్‌లకు నెలవుగా, కళాకారులకు కోటగా మారిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని శ్రీనివాస ధ్యాన మందిరంలో శ్రీ వేద దార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో మ్రహ్మనులలో 23 ఉత్తమ, ఆదర్శ దంపతులకు పురస్కారాలు అందించారు.

ఈ కార్యక్రమానికి హాజరయిన హరీశ్‌రావు శ్రీ వేద దార్మిక సేవా సమితి నూతన కార్యవర్గాన్ని సన్మానించారు. అనంతరం బ్రాహ్మణంలోఉత్తమ, ఆదర్శ దంపతులను ఘనంగా సన్మానించి పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా ఆదర్శ దంపతులకు హరీశ్‌రావు పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ శ్రీ వేద ధార్మిక సేవా సమితి ఆదర్శ, ఉత్తమ దంపతులకు పురస్కారాలు అందించడం, అది నా చేతుల మీదుగా అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగా ణ ఏర్పడ్డాక దేవాలయాల అభివృద్ధికి నిధులు, అర్చకులకు, ఉద్యోగులకు నేరుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచే వేతనాలు అందిస్తున్నామన్నారు.

ఆలయాల అభివృద్ధికి కృషి
జిల్లాలో గతంలో 100ఆలయాలకు మాత్రమే దీపాదుప నైవేద్యాల కోసం రూ.2,500 నుంచి నేడు జిల్లాలోని 300ఆలయాలకు రూ.6,000చొప్పున అందిస్తున్నామన్నారు. కేసీఆర్‌ బ్రామ్మణులకు బందువు అని, అందుకే బ్రాహ్మణ పరిషత్‌ ఏర్పరిచి రూ.1000కోట్లు కేటాయించారన్నారు. జిల్లాలో అనేక ఆలయాలు ఉన్నాయని, జీర్ణ ఆలయాలకు ప్రభుత్వం నిధులు కేటాయించి పునరుద్ధరణకు కృషి చేస్తోందన్నారు. శ్రావణ మాసాన్ని పురష్కరించుకొని పట్టణంలోని శ్రీ సంతోషిమాత ఆలయంలో, శ్రీ మోహిణిపుర వేంకటేశ్వర ఆలయంలో హరీశ్‌రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి రాధకృష్ణశ ర్మ, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సూడా చై ర్మ న్‌ రవీందర్‌రెడ్డి, స్థానిక కౌన్సిలర్‌ చిప్ప ప్రభాకర్, శ్రీ వేద ధార్మిక సేవా సమితి సభ్యలు, జిల్లాలోని బ్రాహ్మణులు తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఇంటికీ తాగు నీరు అందిస్తాం
సిద్దిపేటఅర్బన్‌: మూడు నెలల్లోగా వాటర్‌ ట్యాంకు నిర్మాణం పూర్తి చేసి టీహెచ్‌ఆర్‌ నగర్‌లోని ప్రతి ఇంటికీ మిషన్‌ భగీరథ ద్వారా తాగు నీరు అందిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట అర్బన్‌ మండల పరిధిలోని పొన్నాల శివారు టీహెచ్‌ఆర్‌ నగర్‌లో, పట్టణ పరిధిలోని హనుమాన్‌నగర్, నర్సాపూర్‌ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల వద్ద రూ.6 కోట్లతో నిర్మించనున్న మిషన్‌ భగీరథ వాటర్‌ ట్యాంకుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా టీహెచ్‌ఆర్‌ నగర్‌లో హరీశ్‌రావుకు మహిళలు మంగళ హారతులతో, డప్పు చప్పుళ్లతో, పూల వర్షంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ సిద్దిపేట పట్టణ శివారు కాలనీల్లో రోడ్డు కబ్జా చేసి ఇళ్ల నిర్మాణాలు చేపట్టవద్దని, నిబంధనలు పాటించాలని లేదంటే కూల్చివేతలు తప్పవన్నారు.

కాలనీలో స్మశాన వాటిక లేదని కాలనీ వాసులు తన దృష్టికి తీసుకువచ్చారు. కాలనీలో రెండు చోట్ల రూ.కోటి 60 లక్షలతో వాటర్‌ ట్యాంకులను నిర్మిస్తున్నామని, వీటిని మూడు నెలల్లోగా పూర్తి చేసి ప్రతి ఇంటికి తాగు నీరు అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌ పర్సన్‌ రోజాశర్మ, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, సుడా చెర్మన్‌ రాజనర్సు, అర్బన్‌ జెడ్పీటీసీ తుపాకుల ప్రవళిక, వైస్‌ ఎంపీపీ ఎల్లం, పొన్నాల సర్పంచ్‌ తన్నీరు రేణుకశ్రీనివాస్, ఎంపీటీసీ మమత యాదగిరి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ శ్రీనివాసచారి, డీఈ నాగభూషణం, కాలనీ అధ్యక్షుడు గట్టు నర్సింలు, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

నంబర్‌వన్‌ మున్సిపాలిటీగా సిద్దిపేట
సిద్దిపేటరూరల్‌: తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వడంలో సిద్దిపేట మున్సిపాలిటీ దేశంలోనే నెంబర్‌వన్‌ స్థానంలో ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని బుస్సాపూర్‌ గ్రామంలో సిద్దిపేట మున్సిపాలిటీకి చెందిన డంప్‌యార్డులో రూ.50లక్షలతో నిర్మించనున్న సెగ్రిగేషన్‌షెడ్, రూ.1.20 కోట్లతో నిర్మించనున్న ఫీకల్‌ స్లడ్జ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నిర్మాణాలకు ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని 72 మున్సిపాలిటీల్లో సిద్దిపేట తడి, పోడి చెత్తను వేరు చేసి ఇస్తుందన్నారు. పట్టణ ప్రజలు, స్వయం సహాయక బృందాల సాయంతో స్వచ్ఛందంగా 60 శాతం వరకు చెత్తను వేరు చేసి ఇస్తున్నారని తెలిపారు. మిగిలిన 40 శాతం మెకనైజ్డ్‌ ద్వారా బుస్సాపూర్‌లోని డంప్‌యార్డులో వేరు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

దీని కోసం సెగ్రిగేషన్‌ షెడ్, ఫీకల్‌ స్లడ్జ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ నిర్మించనున్నామన్నారు. ఈ నిర్మాణాన్ని 6 నెలల్లో పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. దీంతో వంద శాతం తడి, పొడి చెత్తను వేర్వేరుగా చేసి ఆదాయ వనరులు తెచ్చుకునేలా సిద్దిపేట మున్సిపాలిటీ కృషి చేస్తుందన్నారు. త్వరలో సిద్దిపేట పట్టణంలోని పలు వార్డుల్లో డీఆర్‌సీ కేంద్రాలను నిర్వహించాలని, ప్రధానంగా పట్టణంలోని స్వయం సహాయక బృందాల పాత్ర చాలా ముఖ్యమని వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. రెండు రకాలుగా చెత్తను వేరు చేస్తున్న మెకనైజ్డ్‌ మాన్యువల్‌ పద్ధతిపై ఏజెన్సీ ప్రతినిధులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, పబ్లిక్‌ హెల్త్‌ డిపార్టుమెంటు ఈఈ వీరప్రతాప్, డీఈ లక్ష్మణ్, ఏఈలు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు