67 మందితో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గం

10 Oct, 2017 02:29 IST|Sakshi

సెక్రటరీ జనరల్‌గా కేకే కొనసాగింపు

20 మంది ప్రధాన కార్యదర్శులు.. 33 మంది కార్యదర్శులు

పన్నెండు మంది సహాయ కార్యదర్శులు

కేసీఆర్‌ రాజకీయ కార్యదర్శిగా సుభాష్‌రెడ్డి

అతి త్వరలో కార్యవర్గ సమావేశం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) రాష్ట్ర కార్యవర్గం కొలువుదీరింది. 67 మందితో కూడిన కార్యవర్గాన్ని పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం రాత్రి ప్రకటించారు. రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావును సెక్రెటరీ జనరల్‌గా, శేరి సుభాష్‌రెడ్డి పార్టీ అధ్యక్షుని రాజకీయ కార్యదర్శిగా కొనసాగనున్నారు. 20 మంది ప్రధాన కార్యదర్శులు, 33 మంది కార్యదర్శులు, 12 మంది సహాయ కార్యదర్శులను నియమించారు.

కార్యవర్గంలోని 40 మందికి ఒక్కొక్కరికి మూడు చొప్పున అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యత కేటాయించనున్నారు. ఎవరికి ఏ సెగ్మెంట్లన్నది త్వరలో ప్రకటిస్తారు. ఇక 12 మంది ప్రధాన కార్యదర్శులకు ఒక్కొక్కరికి 10 అసెంబ్లీ స్థానాల పర్యవేక్షణ బాధ్యత అప్పగిస్తారు. మిగతా ప్రధాన కార్యదర్శులకు టీఆర్‌ఎస్‌ కేంద్ర కార్యాలయ నిర్వహణతో పాటు అనుబంధ సంఘాలు, శిక్షణ శిబిరాలు తదితర కార్యకలాపాల నిర్వహణ బాధ్యత అప్పగిస్తారు. బాధ్యతల కేటాయింపు పూర్తి చేసి త్వరలో రాష్ట్ర కార్యవర్గాన్ని సమావేశపరచాలని కేసీఆర్‌ నిర్ణయించారు.

కార్యదర్శులు
ఎడవెల్లి కృష్ణారెడ్డి, బి.శ్రీనివాస్‌ యాదవ్, పన్యాల భూపతిరెడ్డి, నాగేందర్‌ గౌడ్‌ (టీఎస్‌ఈడబ్యూఐడీసీ చైర్మన్‌), తానిపర్తి భానుప్రసాద్‌ (ఎమ్మెల్సీ), చాడ కిషన్‌ రెడ్డి, ఎం.డి.జహంగీర్‌ పాషా, బడుగు లింగయ్య యాదవ్, పట్నం నరేందర్‌ రెడ్డి (ఎమ్మెల్సీ), తెల్ల వెంకటరావు, దాదన్నగారి విఠల్‌ రావు, ఎం.డి.ఇషాక్‌ (ఇంతియాజ్‌), రూప్‌ సింగ్, మందుల సామేలు (వేర్‌హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌), ఎం.డి.నిరంజన్‌ వలీ, బక్కి వెంకటయ్య, సఫాన్‌ దేవ్‌ ముదిరాజ్, అందె బాబయ్య ముదిరాజ్, టి.మధుసూదన్, తారిఖ్‌ అన్వర్, ఎర్నేని వెంకటరత్నంబాబు, గట్టు రాంచందర్‌ గౌడ్, కర్ర శ్రీహరి, కవిత మాలోతు (మాజీ ఎమ్మెల్యే), కోలేటి దామోదర్‌ గుప్తా (పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌), రాధాకృష్ణ శర్మ, వై.వెంకటేశ్వర్లు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, లోకా భూమారెడ్డి (డెయిరీ చైర్మన్‌), ఫరూఖ్‌ హుస్సేన్‌ (ఎమ్మెల్సీ), మెట్టు శ్రీనివాస్, లింగంపల్లి కిషన్‌రావు (టీఎస్‌ అగ్రోస్‌ చైర్మన్‌), తాడూరి శ్రీనివాస్‌ (ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌).

సహాయ కార్యదర్శులు
బండ శ్రీనివాస్, వి.కె.మహేశ్, ప్రొఫెసర్‌ జి.విద్యాసాగర్, పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, మూల విజయారెడ్డి, లోక బాపురెడ్డి (మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌), నక్క ప్రభాకర్‌ గౌడ్, వలియా నాయక్, కనకా లక్కేరావు, గూడూరి ప్రవీణ్, అరికెల నాగేశ్వరరావు, గౌటి అశోక్‌ గంగపుత్ర.  

ప్రధాన కార్యదర్శులు
ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌రెడ్డి (ఎమ్మెల్సీ), తుల ఉమ (జెడ్పీ చైర్‌పర్సన్‌), బస్వరాజు సారయ్య (మాజీ మంత్రి), తక్కళ్లపల్లి రవీందర్‌రావు, ఎం.డి.ఫరీదుద్దీన్‌ (ఎమ్మెల్సీ), పల్లా రాజేశ్వర్‌రెడ్డి (ఎమ్మెల్సీ), బండా ప్రకాశ్‌ ముదిరాజ్, వి.గంగాధర్‌ గౌడ్‌ (ఎమ్మెల్సీ), జె.సంతోష్‌ కుమార్, నారదాసు లక్ష్మణ్‌రావు (ఎమ్మెల్సీ), పి.రాములు (మాజీ మంత్రి), ఆర్‌.శ్రవణ్‌కుమార్‌ రెడ్డి, చాగళ్ల నరేంద్రనాథ్‌ , నూకల నరేశ్‌రెడ్డి, గ్యాదరి బాలమల్లు (టీఎస్‌ఐఐసీ చైర్మన్‌), మైనంపల్లి హనుమంతరావు (ఎమ్మెల్సీ), సోమ భరత్‌కుమార్‌ గుప్తా, బండి రమేశ్, సత్యవతీ రాథోడ్‌ (మాజీ ఎమ్మెల్యే), బి.వెంకటేశ్వర్లు (ఎమ్మెల్సీ).

మరిన్ని వార్తలు