ఫీ‘జులుం’పై కొరడా

10 Jul, 2020 03:52 IST|Sakshi

కార్పొరేట్‌ స్కూళ్లలో తనిఖీలు.. రికార్డులు సీజ్‌

30 స్కూళ్లకు నోటీసులు

ఆన్‌లైన్‌ బోధనకు అనుమతుల్లేవ్‌: విద్యాశాఖ

సాక్షి, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో నిబంధనలకు విరు ద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్‌ స్కూళ్లపై విద్యాశాఖ కొరడా ఝళిపి స్తోంది. జీవో నంబర్‌ 46కు విరుద్ధంగా హైదరాబాద్‌లోని పలు కార్పొరేట్‌ స్కూళ్లు ఫీజులు వసూలు చేస్తున్నాయని, విద్యా ర్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు విద్యాశాఖకు ఇటీవల భారీ సంఖ్యలో ఫిర్యా దులు అందాయి. దీంతో అధికారు లు గురువారం రంగంలోకి దిగారు. గత ఏడాది నిర్దేశించిన ట్యూషన్‌ ఫీజుకు మించి వసూలు చేస్తున్న పాఠశాలల్లో ఆకస్మిక తని ఖీలు చేశారు. హైదరాబాద్‌లో 11, రంగా రెడ్డిలో 13, మేడ్చల్‌ జిల్లాలో 6 కార్పొరేట్‌ పాఠ శాలలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఫీజు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.  
విద్యా సంవత్సరం మొదలు కాకున్నా..
గ్రేటర్‌ పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో సుమారు ఏడు వేల ప్రైవేట్‌ స్కూళ్లు ఉన్నాయి. వాటిలో 15 లక్షల మంది విద్యార్థులు చదువు తున్నారు. 60% మంది విద్యార్థులు కేవలం ఇంటర్నేషనల్, కార్పొరేట్‌ స్కూళ్లలోనే చదువుతు న్నారు. దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి ఇంకా కొన సాగుతూనే ఉంది. ఇప్పటి వరకు విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందో లేదోకూడా ఇప్పటివరకు స్పష్టత లేదు.

కానీ నగరంలోని పలు ఇంట ర్నేషనల్, కార్పొరేట్‌ స్కూళ్లు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తు న్నాయి. విద్యార్థుల సామర్థ్యా లను పరిగణనలోని తీసుకోకుండా ఎల్‌కేజీ విద్యార్థులకు కూడా ఆన్‌లైన్‌ తరగతులు చేపడుతున్నాయి. ఆన్‌లైన్‌లో క్లాసు వినాలంటే స్కూల్‌ యూనిఫారం ధరించాలనే నిబంధన కూడా విధించాయి. ఆన్‌లైన్‌ పాఠాల పేరుతో తమ వద్దే పుస్తకాలు సహా ల్యాప్‌ టాప్‌లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను కొనుగోలు చేయాలని నిబంధన విధిస్తున్నాయి.

ఫిర్యాదులు వెల్లువెత్తడంతో..
ఫస్ట్‌ టర్మ్‌ ఫీజు చెల్లించాల్సిందిగా తల్లిదం డ్రులపై పాఠశాలల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి. కొన్ని స్కూళ్లయితే ఏకంగా స్నాక్స్, ట్రావెలింగ్, లైబ్రరీ, స్పోర్ట్స్‌ చార్జీలు కూడా వసూలు చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ట్యూషన్‌ ఫీజు మినహా మరే ఇతర ఫీజులు వసూలు చేయవద్దని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇంటర్నేషనల్, కార్పొరేట్‌ స్కూళ్లు పట్టించుకోవడం లేదు. యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్నాయి.

ఇందుకు నిరాకరించిన తల్లిదండ్రులను అడ్మిషన్‌ క్యాన్సల్‌ చేస్తామని బెదిరిస్తున్నాయి. దీంతో కొంత మంది తల్లిదండ్రులు ఆయా యాజమాన్యాల ఒత్తిళ్లకు తలొగ్గి వారు అడిగినంత ఫీజులు చెల్లిస్తున్నారు. మరికొంత మంది విద్యాశాఖకు ఫిర్యాదు చేస్తుండటంతో అధికారులు స్పందించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తూ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్‌ స్కూళ్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తున్నారు.

ఆన్‌లైన్‌ తరగతులకు అనుమతి ఇవ్వలేదు
ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించేందుకు హైదరాబాద్‌ జిల్లాలో ఏ ఒక్క స్కూల్‌కూ అనుమతి ఇవ్వలేదు. అధికారికంగా ఇప్పటివరకు విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదు. ఆన్‌లైన్‌ తరగతుల పేరుతో ఎవరైనా తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. నిబంధనలు అతిక్రమించిన స్కూళ్లను సీజ్‌ చేయడానికి కూడా వెనుకాడం. – వెంకటనర్సమ్మ, డీఈఓ, హైదరాబాద్‌  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా