నిరసనల జోరు..నినాదాల హోరు..

15 Oct, 2019 01:18 IST|Sakshi

పదో రోజుకు చేరిన ఆర్టీసీ సమ్మె...

కుటుంబ సభ్యులతో కార్మికుల మహా ధర్నా

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మె తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది.10 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నుంచి హామీ లేకపోవడంతో వెనక్కి తగ్గేది లేదంటూ కార్మికులు పట్టు వీడట్లేదు. ఆందోళనల్లో భాగంగా సోమవారం బస్‌ డిపోల ఎదుట ధర్నాలు నిర్వహించారు. డిమాండ్లపై స్పందించే వరకు వెనుకాడేది లేదన్న కారి్మకులు.. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వ మొండి వైఖరి వల్లే కారి్మకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఈ మరణా లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ డిమాండ్‌ చేశారు. అనంతరం బస్‌డిపోలు, బస్టాండ్‌ల వద్ద ఆర్టీసీ కారి్మక జేఏసీ ఆధ్వర్యంలో డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి సంతాపసభలు నిర్వహించారు.

రోడ్లపైకి 5,375 బస్సులు 
కారి్మకుల సమ్మె దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బంది రాకుండా ఆర్టీసీ యాజమాన్యం సోమవారం 5,375 బస్సులు తిప్పినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో 3,557 బస్సులు ఆర్టీసీ సంస్థవి కాగా, 1,818 బస్సులు అద్దె పద్ధతిలో తీసుకున్నవి.

సురేందర్‌ మృతదేహానికి పోస్టుమార్టం
ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరితో ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకున్న కండక్టర్‌ సురేందర్‌గౌడ్‌ మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో డాక్టర్‌ రమణమూర్తి నేతృత్వంలో వైద్యుల బృందం సోమవారం పోస్టుమార్టం నిర్వహించింది. అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు తదితరులు ఆస్పత్రిలో సురేందర్‌ మృతదేహానికి నివాళులరి్పంచారు.

ముగిసిన అంత్యక్రియలు 
ఆర్టీసీ సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరితో ఆందోళన చెంది ఆత్మహత్య చేసుకున్న కండక్టర్‌ సురేందర్‌గౌడ్‌ అంత్యక్రియలు సోమవారం కార్వాన్‌లో ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ నేతలు, కారి్మకులతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు,కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. మరోవైపు హెచ్‌సీయూ బస్‌ డిపో వద్ద తలపెట్టిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్న కండక్టర్‌ సందీప్‌ అక్కడే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పరిస్థితిని గమనించిన కారి్మకులు తక్షణం స్పందించి కొండాపూర్‌ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ కారి్మకుల సమ్మెకు మద్దతుగా సోమవారం ఉస్మానియా వర్సిటీ విద్యార్థి సంఘాలు బస్‌భవన్‌ను ముట్టడించాయి.

మంత్రి పువ్వాడ అజయ్‌ సంతాపం 
ఆర్టీసీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రెడ్డి మృతి పట్ల రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సోమవారం ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు. శ్రీనివాస్‌రెడ్డి మృతి తీవ్రంగా కలచివేసిందని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రారి్థంచారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా