అమ్మా.. మందకృష్ణను మాట్లాడుతున్నా..

20 Feb, 2016 01:20 IST|Sakshi

* ప్రభుత్వ విప్‌కు అగంతకుడి ఫోన్
* రెండు రోజుల్లో 17 కాల్స్
* అనుమానంతో మందకృష్ణకు ఫోన్ చేసిన సునిత
* తాను కాదంటూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడి వివరణ
* ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్‌కు ఫిర్యాదు చేసిన విప్

యాదగిరిగుట్ట : ‘‘అమ్మా.. నేను మందకృష్ణ మాదిగను మాట్లాడుతున్నా.. పేదింటి యువతికి వివాహం చేస్తున్నాం.. రూ. 6వేల ఆర్థికసాయం చేయాలి’’ అంటూ ఓ అగంతకుడు ప్రభుత్వ విప్ గొంగిడి సునితారెడ్డికి పలుమా ర్లు ఫోన్ చేశాడు. రెండు రోజుల్లోనే 17 సార్లు ఫోన్ చేశారు. దీంతో ఆమె విసిగి ఎస్పీకి చేశారు. విప్ సునీతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గత బుధవారం రాత్రి విప్ సునీతారెడ్డికి గుర్తుతెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చింది.

మందకృష్ణ మాదిగను మట్లాడుతున్న ఆర్థికసాయం కావాలని కోరగా సరే చూద్దాం లే అని ఆమె ఫోన్ కట్ చేసింది. మరుసటి రోజు ఉదయం 8.30 గంటల సమయంలో  ఫోన్ చేయగా బిజీగా ఉన్నానన్డి ఫోన్ పెట్టేశారు. ఆ  తర్వాత 11.15 వరకు వరుసగా 7 సార్లు ఫోన్ చేశాడు. అవసరమైతే ఎదైనా కల్యాణ మండపం ఇప్పిస్తానని విప్ సునీతారెడ్డి బదులు ఇచ్చారు. దీనికి ఫోన్ చేసిన వ్యక్తి లేదు లేదు రూ.ఆరు వేల సహాయమే కావాలని అడిగాడు. ఇలా బుధవారం, గురువారం  రెండు రోజుల్లో  ఓ నంబర్ నుం చి 14 సార్లు, మరో నంబర్ నుంచి 3 సార్లు ఫోన్ చేశాడు.

రూ.ఆరు వేల కోసం మందకృష్ణ మాదిగ తనకు ఇన్ని సార్లు ఫోన్ చేయడం ఏమిటని అనుమానంతో విప్ మందకృష్ణ మాదిగకు ఫోన్ చేశారు. రూ. ఆరు వేలు ఎక్కడికి పంపించమంటారని అడగడంతో ఆయన అవాక్కయ్యారు. నేను మీకు ఫోన్ చేయలేదు అంటూ వివరణ ఇచ్చారు. దీంతో ఆమె వెంటనేఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్‌కు ఫిర్యాదు చేశారు. 25 రోజుల క్రితం కూడా ఓ అగంతకుడు ఫోన్ చేసి డబ్బులు అడిగాడని తెలిపారు.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. కాగా ఫోన్ నంబర్ల ఆధారంగా  ఓ అనుమానితుడిని పోలీ సులు  అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు