హక్కులు అడిగితే దాడులా?

7 Mar, 2016 02:28 IST|Sakshi
హక్కులు అడిగితే దాడులా?

వీణవంక ఘటన దారుణం
షీటీమ్స్ రాష్ర్టమంతా ఉండాలి
పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు వి. సంధ్య

 
 
మహబూబాబాద్ రూరల్
: పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను కేంద్ర, రాష్ట్ర పాలకులు విస్మరిస్తున్నాయని ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడ బ్ల్యూ) రాష్ట్ర అధ్యక్షురాలు వి.సంధ్య అన్నారు. పట్టణంలోని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంధ్య మాట్లాడారు. మార్చి 8న అంతర్జాతీయ శ్రామి క మహిళా పోరాట దినంగా పాటించాలని, హిందుత ్వ ప్రభావంతో పెట్రేగిపోతున్న కుల, మత, జండర్ హింసలకు వ్యతిరేకంగా పోరాడాలని సూచించారు. ఓటుహక్కు, సమానత్వ హక్కుల కోసం మహిళలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా వీణవంక అత్యాచారం ఘటన బాధాకరమని పేర్కొన్నారు.

తన స్నేహితురాలిని కొంత మంది స్థానిక గుట్టల్లోకి తీసుకెళ్లారని, మరో విద్యార్థిని అక్కడి ఎస్సైకి చెప్పినాపట్టించుకోకపోవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల రక్షణ కోసం షీటీమ్స్‌ను ఏర్పాటు చేశామని ప్రకటించినప్పటికీ అవి ఎక్కడా పని చేయడం లేదని విమర్శించారు. చత్తీష్‌ఘడ్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారిలో ఐదుగురు మహిళలే ఉన్నారన్నారు. ప్రభుత్వం తమది ఎన్‌కౌంటర్లు లేని తెలంగాణ అంటూ, మావోయిస్టుల ఎజెండా అంటూ ఈ విధంగా వ్యవహరించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.

పోడు భూముల కోసం ఆదివాసీ ప్రజలు ఉద్యమిస్తుంటే వారిపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. నరేంద్రమోడీ ప్రభుత్వంలో రోిహ త్ నుంచి కన్హయ్యకుమార్ వరకు జరిగిన సంఘటనలు పరిశీలిస్తే కులపెత్తనమే రాజ్యమేలుతోందని ఆరోపించారు. బీజేపీ , కేసీఆర్ ప్రభుత్వాలు మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. మహిళల కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి దానిని షీటీమ్స్‌కు అనుసంధానం చేయాలని కోరారు. ప్రియాంక, భూమిక మృతి విషయంలో హాస్టల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ప్రజాస్వామిక రచయితల వేదిక రాష్ర్ట కార్యదర్శి బండారు విజయ, పీఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు గుజ్జు కృష్ణవేణి, ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేశెట్టి రాంచంద్రయ్య పాల్గొన్నారు

మరిన్ని వార్తలు