నాసిరకం సరుకులు సరఫరా చేశారు 

21 Jul, 2019 13:05 IST|Sakshi
నకిలీ నూనె ప్యాకెట్లను చూపిస్తున్న బీమా సాహెబ్‌

బీమా సాహెబ్, గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు 

మీర్జాపూర్‌ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల సందర్శన 

హుస్నాబాద్‌రూరల్‌: మీర్జాపూర్‌ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులకు టెండర్‌లో చూపిన కంపెనీ సరుకులు కాకుండా  తక్కువ ధరలకు వచ్చే నాసిరకం సరుకులను సరఫరా చేసినా వార్డెలు పట్టించుకోవడం లేదని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంఘం ఉపాధ్యక్షుడు బీమా సాహెబ్‌ ఆరోపించారు. శనివారం హుస్నాబాద్‌ మండలం మీర్జాపూర్‌ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా  విద్యార్థులకు పెట్టె భోజన సామగ్రిని పరిశీలించారు.  పిల్లలకు పోషకాలు లభించే కోడి గుడ్లలో కూడ తక్కువ ధరలకు వచ్చే చిన్న కోడి గుడ్లను సరఫరా చేస్తున్నారని అన్నారు.

టీచర్లు పాఠశాలకు రావడం లేదు.. 
పాఠశాల సమయంలో తరగతి గదుల్లో ఉండాల్సిన టీచర్లు వారికి ఇష్టం వచ్చినట్లు బయట తిరుగుతున్నారని అన్నారు. కొందరు టీచర్లు పాఠశాలకు రావడం హాజరు రిజిష్టర్‌లో సంతకాలు చేసి మళ్లీ రోడ్లపైకి వస్తున్న ప్రిన్సిపాల్‌ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పాఠశాలలో జీవశాస్త్రం టీచరు లేరని, విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేసే ఏఎన్‌ఎం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు.  వెంటనే విచారణ జరిపి   తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వీరి వెంట డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు జి.శివరాజ్,రమేశ్‌లు ఉన్నారు.  

>
మరిన్ని వార్తలు