గల్లీ గల్లీలో గణే శుడు

31 Aug, 2014 01:15 IST|Sakshi
గల్లీ గల్లీలో గణే శుడు
  • భారీగా మండపాల ఏర్పాటు
  • సాక్షి, సిటీబ్యూరో: జంట నగరాల్లో భారీ సంఖ్యలో గణనాథులు కొలువుదీరారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మండపాల సంఖ్య గణనీయుంగా పెరిగింది. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో వేలాది అపార్టుమెంట్లు ఉన్నాయి. అందువల్లనే జంట నగరాల్లో సుమారు లక్ష వినాయక మండపాలు ఏర్పాటైనట్లుగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వర్గాలు పేర్కొంటున్నాయి. అపార్టుమెంట్లలోని గణేష్ మండపాలు అధికారిక లెక్కల్లోకి వచ్చే అవకాశం లేకపోవటంతో ఈ సంఖ్యలో తేడాలు ఉంటున్నాయుని తెలుస్తోంది.

    గత ఏడాది హైదరాబాద్ పరిధిలో 13,500, సైబరాబాద్ పరిధిలో 10,100 చొప్పున 23,600 వినాయక మండపాలు ఏర్పాటు చేసినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. నివుజ్జన లెక్కల ప్రకారం ఇవి 60వేలుగా చెబుతున్నాయి. ఈ ఏడాది కూడా అధికారిక వర్గాల లెక్కల ప్రకారం హైదరాబాద్ పరిధిలో 15వేలు, సైబరాబాద్ పరిధిలో 11వేల వినాయక మండపాలు ఏర్పాటయ్యూయి.

    ఖైరతాబాద్‌లో 60 అడుగుల ఎత్తుతో వినాయక విగ్రహం ఏర్పాటు చేయగా... మిగతా ప్రాంతాల్లో వివిధ రూపాల్లో... విభిన్న సైజుల్లో గణేశునిప్రతిష్ఠింపజేశారు. ఈసారి మట్టి విగ్రహాల సంఖ్య పెరిగింది. ఎనిమిది ప్రాంతాల్లోని పార్కుల్లో పండుగ రోజు ఇళ్లలో పూజకు ఉపయోగపడే 8 అంగుళాల నుంచి 3 అడుగుల వరకూ వినాయక విగ్రహాలను హెచ్‌ఎండీఏ పంపిణీ చేసింది. దీనికి రూ.6 లక్షలు వెచ్చించింది.
     
    గణేశుని సేవలో...
     
    వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో, శాంతియత వాతావరణంలో నిర్వహించేందుకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి   డివిజన్ల వారీగా కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలను అనునిత్యం సయన్వయ పరుస్తూ, కార్యక్రమాలను పర్యవేక్షిస్తోంది.  మండపాలకు ఉచి త విద్యుత్తు ఇవ్వాలని కమిటీ విజ్ఞప్తి చేసిం ది. గతఏడాది మండపాల నిర్వాహకులు విద్యుత్తు ఛార్జీలకు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు చెల్లించారని.. ఈసారి ప్రభుత్వమే భరించాలని కోరుతోంది.
     
    ఊహించినంత లేదు...  

    తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక ప్రప్రథమంగా జరుగుతున్న వినాయుక ఉత్సవాల సందర్భంగా మండపాలు పెరిగే అవకాశం ఉందని విగ్రహాల తయూరీదారులు, కళాకారులు భావించారు. ఈ నేపథ్యంలోనే 1.50 లక్షలకు పైగా విగ్రహాలను వివిధ ప్రాంతాల్లో అవ్ముకానికి పెట్టారు. ఊహించిన స్థాయిలో వుండపాలు ఏర్పాటు కాకపోయేసరికి 50 వేలకు పైగా విగ్రహాలు నగరంలో మిగిలిపోయినట్టు తెలుస్తోంది. మొత్తం మీద గ్రేటర్‌లో లక్షకు పైగా వినాయుక వుండపాలు ఏర్పాటు చేసినట్టు సమాచారం.

     

మరిన్ని వార్తలు