వీఆర్‌ఓల బదిలీలు షురూ..!

3 Jul, 2015 00:19 IST|Sakshi

జిల్లాలో గ్రామ రెవెన్యూ అధికారు(వీఆర్‌ఓ)ల బదిలీలకు జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టింది.ఏడేళ్లకు పైబడి ఒకే చోట పనిచేస్తున్న వారంతా బదిలీలకు ఈ నెల 10వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో లేని విధంగా, పరిపాలన సౌలభ్యం కోసం ప్రస్తుత బదిలీల్లో సొంత మండలాలను, ప్రస్తుతం పనిచేస్తున్న నియోజకవర్గం దాటి బదిలీ చేయాలని నిర్ణయించింది.
 
 చౌటుప్పల్ :  జిల్లాలో 830వీఆర్వో పోస్టులుండగా 733మంది పనిచేస్తున్నారు. మొత్తం 97పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2008లో బదిలీ అయిన వారు ఇప్పటి వరకు ఏడేళ్లకు పైబడి ఒకేచోట పనిచేస్తున్నారు. ఇలా జిల్లాలో మొత్తం 231మంది ఉన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం వీరందరినీ బదిలీ చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఏడేళ్లు పూర్తి చేసుకున్న వీఆర్‌ఓల జాబితాను, ఖాళీగా ఉన్న జాబితాను విడుదల చేసింది. వీరంతా ఈ నెల 10వ తేదీలోగా బదిలీకోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 7ఏళ్ల సర్వీసు పూర్తయిన వారు ఆలేరు నియోజకవర్గంలో 23మంది, భువనగిరి-19, మునుగోడు-19, దేవరకొండ-14, తుంగతుర్తి-31, సూర్యాపేట-24, నకిరేకల్-32, కోదాడ-11, మిర్యాలగూడ-7, హుజూర్‌నగర్-11, నల్లగొండ-14, నాగార్జునసాగర్ నియోజకవర్గంలో 26మంది ఉన్నారు. వీరంతా తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంది.
 
 సొంత మండలానికి బదిలీ ఉండదు..
 చాలా మండలాల్లో వీఆర్‌ఏలుగా పనిచేసి, వీఆర్‌ఓలుగా ఉద్యోగోన్నతి పొంది, సొంత మండలాల్లోనే పనిచేస్తున్నారు. కొంత మంది వీఆర్‌ఓలు కూడా తమ సొంత మండలాల్లోనే తిష్ట వేశారు. వీరికి ఉద్యోగిగా సరైన గౌరవం దక్కకపోవడంతో పాటు, పాత రికార్డుల మార్పిడి, రాజకీయ సంబంధాలతో జిల్లా యంత్రాంగానికి తలనొప్పిగా మా రారు. దీంతో సొంత మండలాల నుంచి పంపించాలని, బదిలీల్లోనూ సొంత మండలాలకు బదిలీ చేయొద్దని నిర్ణయించింది. ప్రస్తుతం పనిచేస్తున్న నియోజకవర్గం దాటి బదిలీ చేయాలనే ఆలోచనకు వచ్చారంటే పరిస్థితేమిటో అర్థం చేసుకోవచ్చు.
 
 మూడేళ్లు దాటితే రిక్వెస్ట్ బదిలీ..
 ఒకే క్లస్టర్‌లో ఏడేళ్లు దాటిన వారిని బదిలీ చేయాలనుకుంటున్న జిల్లా యంత్రాంగం, మూడేళ్లు దాటిన వారు కూడా బదిలీ కోరితే చేయాలని నిర్ణయించింది. ఈ విషయమై గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నాయకులు గురువారం కలెక్టర్ సత్యనారాయణరెడ్డిని కలిసి విన్నవించారు. అందుకు కలెక్టర్ ఒప్పుకున్నట్టు చెబుతున్నారు. కాగా, ఆలేరు నియోజకవర్గంలో 9, భువనగిరి-6, మునుగోడు-8, దేవరకొండ-14, తుంగతుర్తి-4, సూర్యాపేట-5, నకిరేకల్-9, కోదాడ-13, మిర్యాలగూడ-4, హుజూర్‌నగర్-16, నల్లగొండ-4, సాగర్ నియోజకవర్గంలో 11చొప్పున వీఆర్‌ఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.     

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఐఏఎస్‌ అధికారి మురళి రాజీనామా

‘సీఆర్‌పీఎఫ్‌ కీలక పాత్ర పోషిస్తోంది’

దుబాయ్‌లో నటుడు శివాజీకి చేదు అనుభవం

ఈనాటి ముఖ్యాంశాలు

దాతల సహాయం కూడా తీసుకోండి: ఎర్రబెల్లి

మేయర్‌పై కార్పొరేటర్ల తిరుగుబాటు

ఫలక్‌నామా ప్యాలెస్‌లో క్యాథరిన్‌ హడ్డాకు వీడ్కోలు

మెట్రో రైలుకు తప్పిన ప్రమాదం,ఖండించిన మెట్రో రైల్‌ ఎండీ

శ్మ'శాన' పనుంది!

బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

బ్లెస్సీ.. ఎక్కడున్నావ్‌?

జాతివైరం మరిచి..

సిజ్జూకు ఆపరేషన్‌

తెయూను మొదటి స్థానంలో నిలబెడదాం

గుంతను తప్పించబోయి..

నోటు పడితేనే..

జలయజ్ఞం

మున్సిపోల్స్‌లో కాంగి‘రేస్‌’

నగరంలో పెరుగుతున్న ‘శునక బాధితులు’

30 ఏళ్లుగా అదే రుచి..

జోరు చల్లారింది 

పాలమూరులో మినీ శిల్పారామం

యాక్సిడెంట్స్‌@ డేంజర్‌ స్పాట్స్‌

డిండికి నీటిని తరలించొద్దు

వాల్మీకి టైటిల్‌ను మార్చాలి : ఆర్‌.కృష్ణయ్య

గర్దాస్‌ రమేష్‌పై పీడీ యాక్ట్‌

భగ్గుమంటున్న బియ్యం

కొత్త ‘ఆసరా’పై స్పష్టత కరువు

ఎక్కడి నుంచైనా సరుకులు

సీఎం హామీతో సిద్దిపేట మున్సిపల్‌కు నిధుల వరద

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సంపూ ట్వీట్‌.. నవ్వులే నవ్వులు

బిగ్‌బాస్‌.. జాఫర్‌, పునర్నవి సేఫ్‌!

దిల్ రాజు ప్యానల్‌పై సీ కల్యాణ్ ప్యానల్‌ ఘనవిజయం

ఇది ‘మహర్షి’ కలిపిన బంధం

ప్రేమలో పడ్డ ‘చిన్నారి’ జగదీశ్‌!

కన్నడనాట ‘కామ్రేడ్‌’కి కష్టాలు!