‘గాడి’లో పడేనా..?

3 Dec, 2015 01:24 IST|Sakshi

హన్మకొండ :  షిర్డీ, ముంబై వెళ్లే ప్రయాణికుల కోసం ఉద్దేశించిన కాజీపేట-ముంబై వీక్లీ రైలు ప్రారంభించడంపై రైల్వేశాఖ దాగుడుమూతలు ఆడుతోంది. 2014-15 రైల్వే బడ్జెట్‌లో ఈ ట్రైన్‌ను ప్రవేశపెట్టిన రైల్వేశాఖ గత ఎనిమిది నెలలుగా ఈ విషయంపై నోరెత్తలేదు. తాజాగా కాజీపేట-ముంబై మార్గంలో ప్రత్యేక రైలు నడిపిస్తామంటూ ప్రకటన జారీ చేసింది. దీంతో కాజీపేట-ముంబై రైలు రెగ్యులర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌గా నడిపిస్తారా లేక మాటమాత్రంగా కొన్ని ట్రిప్పులు స్పెషల్ పేరుతో నడిపి ఆ తర్వాత మమ అనిపిస్తారా అనే అనుమనాలు వ్యక్తమవుతున్నాయి.

భక్తులకు మేలు..
వరంగల్ జిల్లా మీదుగా ముంబైకి ప్రస్తుతం రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు(కోణార్క్, విశాఖపట్నం-ముంబై- లోకమాన్య తిలక్ టెర్నినల్) నడుస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ రైళ్లలో బెర్త్ రిజర్వేషన్ చేరుుంచుకోవడం కష్టంగా మారింది. దశాబ్ధ కాలంగా జిల్లా నుంచి షిర్డీకి వెళ్లే భక్తుల సంఖ్య పెరిగింది. అరుుతే ఇక్కడి నుంచి సీటు రిజర్వ్ చేసుకోవడం కష్టంగా మారడంతో ఎక్కువ మంది భక్తులు సికింద్రాబాద్ నుంచి రిజర్వేషన్ చేయించుకుంటున్నారు. అరుుతే ముంబై, షిర్డీ వెళ్లే ప్రయాణికుల అవస్థలు తీర్చేందుకు గత బడ్జెట్‌లో రైల్వేశాఖ కాజీపేట - ముంబై (ఎల్‌టీటీ) రైలును ప్రవేశపెట్టింది. పైగా ఈ రైలు కాజీపేట-బల్లార్షా సెక్షన్‌లో ప్రయూణిస్తుండడంతో ఆ మార్గంలో వెళ్లేవారికి మరో రైలు అందుబాబులోకి వచ్చినట్టైంది.

కొత్త రూటు.. ఎన్నో ప్రయోజనాలు..
గత బడ్జెట్‌లో రైల్వేశాఖ ప్రకటించిన కాజీపేట-ముంబై (ఎల్‌టీటీ) రైలు పూర్తిగా కొత్త మార్గంలో ప్రయాణించనుంది. ఇందులో ఒక ఏసీ టూ టైర్, రెండు ఏసీ త్రీటైర్, ఏడు స్లీపర్ క్లాసులు, ఆరు జనరల్ కలిపి మొత్తం 18 బోగీలు ఉంటాయి. ఈ రైలు ప్రతి శుక్రవారం ఉదయం 11:30కు ముంబై (ఎల్‌టీటీ)లో బయల్దేరి మరుసటి రోజు శనివారం మధాహ్నం 3 గంటలకు కాజీపేట చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి శనివారం సాయంత్రం 5:45కు కాజీపేట నుంచి బయల్దేరి మరుసటి రోజు ఆదివారం ఉదయం 11:15కు ముంబై (ఎల్‌టీటీ) చేరుకుంటుంది. జమ్మికుంట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్‌పూర్‌కాగజ్‌నగర్, బల్లార్షా, మజ్రీకదన్, వాని, పింపల్‌కుట్, ఆదిలాబాద్, కిన్వత్, హిమాయత్‌నగర్‌డెక్కన్, భోకార్, ముద్కేడ్, నాందేడ్, పూర్ణ, పర్భని, జాల్నా, ఔరంగాబాద్, నాగర్‌సోల్, మన్మాడ్, నాసిక్, కళ్యాణ్ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. కాజీపేట-బల్లార్షా మార్గంలో కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కొత్త రైలు అందుబాటులోకి రానుంది. వారాంత ంలో ముంబై, షిర్డీ వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు ఉపయుక్తంగా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు ప్యాసింజరు రైళ్ల రాకపోకలకు టెర్మినల్‌గా ఉన్న కాజీపేట స్టేషన్ హోదా ఎక్స్‌ప్రెస్ టెర్మినల్‌గా అప్‌గ్రేడ్ అయ్యేందుకు ఆస్కారం ఏర్పడనుంది.
 
తాజాగా ప్రత్యేక పాట.. 2015 సెప్టెంబర్‌లో రైల్వేశాఖ ప్రకటించిన టైం టేబుల్‌లో కాజీపేట-ముంబై (ఎల్‌టీటీ) రైలుకు సంబంధించిన రాకపోకల వివరాలు ప్రకటించా రు. దీంతో రేపోమాపో రైలు ప్రారంభమవతుం దని ఆశిస్తున్న తరుణంలో రైల్వేశాఖ ప్రత్యేక రైలు గా పేర్కొంటూ బుధవారం ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా కాజీపేట -ముంబై (ఎల్‌టీటీ)ల మధ్య డిసెంబర్ 11, 12, 18, 19, 26, 27 తేదీల్లో మూడు ట్రిప్పులు నడిపిస్తామని పేర్కొంది. ఈ రైలు టికెట్ల బుకింగ్ నేటి(డిసెంబర్ 3) నుంచి మొదలవుతాయని తెలిపింది. రైల్వే బడ్జెట్‌లో రెగ్యులర్‌గా పేర్కొన్న రైలును ఇప్పుడు ప్రత్యేక రైలుగా చూపిం చడం పట్ల సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రైలు ముంబై కేంద్రంగా ఉన్న సెంట్రల్ రైల్వే జోన్ ఆధ్వర్యంలో ప్రారంభం కావాల్సి ఉంది. అరుుతే దీనిపై మన ప్రజాప్రతినిధులు రైల్వేశాఖపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యూరని, అందుకే తూతూమంత్రంగా ఈ రైలును ప్రత్యేకంగా నడిపిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రత్యేకం పేరుతో కొన్ని ట్రిప్పులు నడిపించి ఆ తర్వాత ఆదరణ కరువైందంటూ మొత్తానికే  ఎత్తివేస్తారేమోననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
 

మరిన్ని వార్తలు