భార్య ఉండగానే మరో పెళ్లి..

14 Mar, 2016 01:15 IST|Sakshi

న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించిన బాధిత మహిళ
 

చెన్నారావుపేట : మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి భార్య ఉండగానే మరో స్త్రీని వివాహం చేసుకున్న ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై పులి వెంకట్ కథనం ప్రకారం.. చెన్నారావుపేటకు చెందిన కందకట్ల శ్రీనివాస్, సావిత్రి దంపతుల కుమార్తె సాహితి(స్వప్న)ని వరంగల్ లేబర్ కాలనీ(అబ్బకుంట)కి చెందిన నల్ల రాధ, చంద్రవళి దంపతుల కువూరుడు రాజుకు ఇచ్చి రెండేళ్ల క్రితం రూ.6 లక్షల నగదు, 5 తులాల బంగారం, తదితర కానుకలిచ్చి పెళ్లి చేయించారు.

కొన్ని రోజులు వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది. ఆ తర్వాత భర్త రాజుతో పాటు అత్త మామలు రాధ, చంద్రవళి, ఆడపడుచులు రజిని, రాజ్యలక్ష్మీ, మరిది ప్రసాద్ అదనపు కట్నం కోసం వేధించసాగారు. దీంతో నిండు గర్భిణిగా ఉన్న సాహితి 7 నెలల క్రితం తన పుట్టింటికి వెళ్లిపోరుుంది. అక్కడ ఉంటున్న క్రమంలో బాబుకు జన్మనిచ్చింది. ఇంతలోనే ఎవరికీ చెప్పకుండా ఈ నె ల 10న గోనె స్వాతితో రాజు మరో పెళ్లి చేసుకున్నాడు. తాను ఉండగానే వురో స్త్రీని వివాహం చేసుకున్న రాజుపై తగిన చర్యలు తీసుకొని తనకు న్యాయుం చేయూలని నల్ల సాహితి ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.   
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు