ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా..

9 Apr, 2014 05:28 IST|Sakshi
ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా..

కాజీపేట, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచనలు చేసి తక్షణమే తనకు పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని, లేని పక్షంలో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ఆ పార్టీ నియోజకవర్గ నాయకుడు రాజారపు ప్రతాప్ హెచ్చరించారు. కాజీపేట 36వ డివిజన్ సిద్ధార్థనగర్‌లోని ఆయన స్వగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రతాప్ మాట్లాడారు.
 
రెండు దశాబ్దాలుగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం శ్రమిస్తున్న తనను అధిష్టానం గుర్తించకపోవడం బాధాకరమన్నారు. అధికార పద వుల కోసం నిన్న, మొన్న పా ర్టీలో చేరిన వ్యక్తులకు ఎమ్మెల్యే టి కెట్లు కేటాయిం చడం విచారకరమన్నారు. 24 గంటల్లోగా తనకు పార్టీ టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని తెలిపారు. అలాగే జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థు ల ఓట మికి కృషి చేస్తామని హెచ్చరించారు.
 
కార్యకర్తల అభిప్రాయం మేరకు బుధవారం స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ ఎంపీపీ యాదగిరి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కె.నర్సింహరెడ్డి, నాయకులు దండం చంద్రమౌళి, జైపాల్‌రెడ్డి, అంజయ్య, స్వప్న, జగదీష్‌చందర్‌రెడ్డి పాల్గొన్నారు.
 
ప్రతాప్ ఇంటిలో  సిరిసిల్ల రాజయ్యకు పరాభవం..
స్టేషన్‌ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడిన రాజార పు ప్రతాప్‌ను బుజ్జగించేందుకు వరంగల్ ఎంపీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. సిద్ధార్థనగర్‌లోని ప్రతాప్ ఇంటికి రాజయ్య మంగళవారం తన అనుచరులతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా ప్రతాప్ అనుచరులు రాజయ్యను అడ్డుకుని తీవ్ర  ఆగ్రహం వ్యక్తం చేశా రు.
 
రాజయ్య.. గోబ్యాక్.. అంటూ నిన దిస్తూ కాం గ్రెస్ జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలను దహనం చేసి ఆందోళనకు దిగారు. పనిచేసే కార్యకర్తలకు కాం గ్రెస్‌లో స్థానం లేదని నిన్న, మొన్న వచ్చిన వ్యక్తులకు టిక్కెట్ ఎలా ఇస్తారంటూ ఒక దశలో బూతుపురాణం అందుకున్నారు. అయితే ఆందోళనకారులను శాంతింపజేసేందుకు ఎంపీ అభ్యర్థి రాజ య్య ఎంత ప్రయత్నించినా వారు వినలేదు. దీం తో ఆయన అక్కడి నుంచి వెనుదిరిగారు.

మరిన్ని వార్తలు