-
స్టేషన్ ఘనపూర్ (ఎస్సి) నియోజకవర్గం గెలిచిన అభ్యర్థులు వీరే...
స్టేషన్ ఘనపూర్ (ఎస్సి) నియోజకవర్గం స్టేషన్ ఘనపూర్ రిజర్వుడ్ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ పక్షాన పోటీచేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాడికొండ రాజయ్య నాలుగోసారి విజయం సాదించారు. 2018లో రాజయ్యకు టిక్కెట్ వస్తుందా? రాదా అన్న మీ మాంస ఏర్పడినప్పటికీ, చివరికి ఆయన టిక్కెట్ పొందడం, భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగాయి. రాజయ్యకు 35790 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది సింగాపూర్ ఇందిరను ఓడిరచారు. రాజయ్యకు 98612 ఓట్లు రాగా, ఇందిరకు 62822 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిఎస్పి అభ్యర్దిగా పోటీచేసిన రాజారపు ప్రతాప్‌కు 22700 పైగా ఓట్లు వచ్చాయి. తెలంగాణ తొలి క్యాబినెట్లో రాజయ్యకు ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చారు. కాని కొద్ది నెలలకే ఆయనను తప్పించి ఎంపీిగా ఉన్న మరో నేత కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రిగా క్యాబినెట్లోకి తీసుకున్నారు. 2018 ఎన్నికలలో మాత్రం శ్రీహరికి అవకాశం రాలేదు. 2018లో ఆయన కూడా మంత్రి కాలేకపోయారు. ఎమ్మెల్సీ పదవి మాత్రం మిగిలింది. 2014లో రాజయ్య, కాంగ్రెస్ ఐ అభ్యర్ధి విజయ రామారావుపై 58829 ఓట్ల ఆదిక్యతతో విజయ డంఖా మోగించారు. రాజయ్య రెండువేల తొమ్మిదిలో కాంగ్రెస్ ఐలో గెలుపొంది టిఆర్ఎస్లోకి వస్తే, విజయ రామారావు 2004లో టిఆర్ఎస్లో గెలిచి శాసనసభ పక్ష నేతగా ఉండి, తదుపరి ఉప ఎన్నికలో ఓటమి చెందారు. తెలంగాణ ప్రకటన వెలువడిన తర్వాత కాంగ్రెస్ ఐలోకి వెళ్లినా ఆయనకు ఫలితం దక్కలేదు. రాజయ్య తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ ఐ కు రాజీనామా చేసి టిఆర్ఎస్లో చేరారు. తదుపరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో గెలిచారు. తిరిగి సాదారణ ఎన్నికలలో కూడా ఘన విజయం సాధించారు. కాగా గతంలో ఇక్కడ మూడుసార్లు ప్రాతినిద్యం వహించిన టిడిపి నేత కడియం శ్రీహరి కూడా టిఆర్ఎస్లో చేరి వరంగల్ నుంచి లోక్ సభకు పోటీచేసి విజయం సాదించడం విశేషం. స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి 2008 ఉపఎన్నికలో గెలుపొందిన టిడిపి పక్షాన కడియం శ్రీహరి 2009 సాధారణ ఎన్నికలో ఓడిపోయారు. ఆ తర్వాత టిఆర్ఎస్లోకి వెళ్లారు. కడియం శ్రీహరి ఇక్కడ నుంచి మూడుసార్లు గెలిస్తే, గోక రామస్వామి రెండుసార్లు గెలిచారు. 2004లో టిఆర్ఎస్ శాసనసభ పక్షనేతగా వ్యవహరించిన డాక్టర్ జి. విజయరామారావు ఇక్కడ నుంచే ఒకసారి గెలిస్తే, మరోసారి మెదక్ జిల్లా గజ్వేల్‌లో గెలిచారు. ఒకసారి సిద్దిపేట నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2008లో టిఆర్ఎస్ వ్యూహంలో భాగంగా పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీచేయగా, ఆయన ఓడిపోయారు. అప్పుడు టిడిపి నేత కడియం శ్రీహరి గెలిచారు. 1985లో ఇక్కడ గెలిచిన బొజ్జపల్లి రాజయ్య, 1999లో పరకాలలో విజయం సాధించారు. ఘనపూర్ నియోజకవర్గం జనరల్‌గా వున్నప్పుడు ఇక్కడ ఒకసారి గెలిచిన టి.హయగ్రీవాచారి, ధర్మసాగర్లో రెండుసార్లు, హన్మకొండలో ఒకసారి గెలిచారు. హయగ్రీవాచారి తర్వాత కాలంలో నక్సల్స్ తూటాలకు బలైపోవడం ఓ విషాదం. హయగ్రీవాచారి గతంలో పి.వి, మర్రి, అంజయ్య, కోట్ల క్యాబినెట్లలో పనిచేశారు. గోకా రామస్వామి 1978లో చెన్నారెడ్డి క్యాబినెట్లో కొద్దికాలం పనిచేసి, ముఖ్యమంత్రితో తగాదపడి, పడక రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. కడియం శ్రీహరి 1994లో ఎన్.టి.ఆర్. క్యాబినెట్‌లోను, తదుపరి చంద్రబాబు క్యాబినెట్‌లోను పనిచేశారు. ఆ తర్వాత కెసిఆర్ క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రి అయ్యారు. డాక్టర్. జి. విజయరామారావు కొంతకాలం డాక్టర్ రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో పనిచేశారు. డాక్టర్ రాజయ్య కూడా కెసిఆర్ క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా కొంతకాలం ఉన్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిపి ఆరుసార్లు, టిడిపి నాలుగుసార్లు సిపిఐ ఒకసారి, టిఆర్ఎస్ మూడుసార్లు , ఇండిపెండెంటు ఒకసారి గెలిచారు. జనరల్ గా ఉన్నప్పుడు రెడ్లు రెండుసార్లు, ఒకసారి బ్రాహ్మణ, ఒకసారిఇతరులు గెలుపొందారు. స్టేషన్ ఘనపూర్ (ఎస్సి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా..
కాజీపేట, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచనలు చేసి తక్షణమే తనకు పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని, లేని పక్షంలో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ఆ పార్టీ నియోజకవర్గ నాయకుడు రాజారపు ప్రతాప్ హెచ్చరించారు. కాజీపేట 36వ డివిజన్ సిద్ధార్థనగర్‌లోని ఆయన స్వగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రతాప్ మాట్లాడారు. రెండు దశాబ్దాలుగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం శ్రమిస్తున్న తనను అధిష్టానం గుర్తించకపోవడం బాధాకరమన్నారు. అధికార పద వుల కోసం నిన్న, మొన్న పా ర్టీలో చేరిన వ్యక్తులకు ఎమ్మెల్యే టి కెట్లు కేటాయిం చడం విచారకరమన్నారు. 24 గంటల్లోగా తనకు పార్టీ టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని తెలిపారు. అలాగే జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థు ల ఓట మికి కృషి చేస్తామని హెచ్చరించారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు బుధవారం స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో మాజీ ఎంపీపీ యాదగిరి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కె.నర్సింహరెడ్డి, నాయకులు దండం చంద్రమౌళి, జైపాల్‌రెడ్డి, అంజయ్య, స్వప్న, జగదీష్‌చందర్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రతాప్ ఇంటిలో సిరిసిల్ల రాజయ్యకు పరాభవం.. స్టేషన్‌ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడిన రాజార పు ప్రతాప్‌ను బుజ్జగించేందుకు వరంగల్ ఎంపీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. సిద్ధార్థనగర్‌లోని ప్రతాప్ ఇంటికి రాజయ్య మంగళవారం తన అనుచరులతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా ప్రతాప్ అనుచరులు రాజయ్యను అడ్డుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశా రు. రాజయ్య.. గోబ్యాక్.. అంటూ నిన దిస్తూ కాం గ్రెస్ జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలను దహనం చేసి ఆందోళనకు దిగారు. పనిచేసే కార్యకర్తలకు కాం గ్రెస్‌లో స్థానం లేదని నిన్న, మొన్న వచ్చిన వ్యక్తులకు టిక్కెట్ ఎలా ఇస్తారంటూ ఒక దశలో బూతుపురాణం అందుకున్నారు. అయితే ఆందోళనకారులను శాంతింపజేసేందుకు ఎంపీ అభ్యర్థి రాజ య్య ఎంత ప్రయత్నించినా వారు వినలేదు. దీం తో ఆయన అక్కడి నుంచి వెనుదిరిగారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement