ఫేస్‌బుక్ యాజమాన్యం నుంచి రక్షించండి!

24 Dec, 2014 04:17 IST|Sakshi

హైకోర్టులో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పిటిషన్
 సాక్షి, హైదరాబాద్: ఫేస్‌బుక్‌లోని లోపాలను, నంబర్ వన్ స్థానంలో కొనసాగేందుకు అది చేస్తున్న మోసాలను ఎత్తిచూపినందుకు తనపై ఆ వెబ్‌సైట్ యాజమాన్యం దాడులు చేయిస్తోందని, వారి నుంచి ప్రాణహాని ఉన్నందున రక్షణ కల్పించాలంటూ ప్రదీప్ కుమార్ మానుకొండ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హైకోర్టును ఆశ్రయించారు. కాలిఫోర్నియాలో పనిచేస్తున్నప్పుడు ఫేస్‌బుక్‌లో డాటా సెంటర్ సెక్యూరిటీ అనలిస్ట్ ఇంటర్వ్యూకు హాజరయ్యానని, ఆ సందర్భంగా ఫేస్‌బుక్ లోపాల గురించి వివరించానన్నారు.
 
  ఫేస్‌బుక్ యాజమాన్యం మార్కెట్‌లో నంబర్ వన్ స్థానం కోసం.. ఒకే వ్యక్తి అనేక అకౌంట్లు సృష్టించుకునేందుకు సహకరిస్తున్నట్లు ఆ సమయంలో తెలుసుకున్నానని, దీంతో ఆ విషయాన్ని బయటపెడతానన్న ఉద్దేశంతో ఐడియాస్ ప్రాజెక్ట్ సోర్స్ కోడ్ కోసం దాడులు చేయించారని తెలిపారు.  తనకూ అల్‌కాయిదాకు సంబంధాలు ఉన్నట్లు ఫేస్‌బుక్‌లో ఫొటోలతో పోస్టులు సృష్టించి తన ప్రతిష్టను దెబ్బతీశారన్నారు. హైదరాబాద్‌కు వచ్చాక తనపై కత్తితో హత్యాయత్నం కూడా జరిగిందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు