పార్టీ బలోపేతమే లక్ష్యం

24 Mar, 2018 12:42 IST|Sakshi
వైఎస్సార్‌సీపీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న జెట్టి రాజశేఖర్‌

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు జెట్టి రాజశేఖర్‌

ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయిస్తాం

గద్వాల అర్బన్‌: పార్టీ బలోపేతమే తమ లక్ష్యమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు జెట్టి రాజశేఖర్‌ అన్నారు. శుక్రవారం గట్టు మండలం అంతంపల్లికి చెందిన కుమారస్వామి, ప్రహ్లాదరావు, రాజశేఖర్‌రెడ్డి తదితరులు తమ అనుచరులతో కలసి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక వాల్మీకి భవన్‌లో ఏర్పాటుచేసిన సభలో వారందరికీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహానేత, దివంగత ముఖ్యమంత్రి  వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు.

భవిష్యత్‌లో పార్టీ కార్యకర్తలు, అభిమానులకు మంచిరోజులు రానున్నాయని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని ఆరోపించారు. డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూపంపిణీ, లక్ష ఉద్యోగాలు, కేజీ టు పీజీ ఉచిత విద్య, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని విమర్శించారు. అంతకుముందు పాతబస్టాండు వద్ద వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాగా గట్టు, మల్దకల్, కేటీదొడ్డి, ధరూరు మండలాలకు చెందిన సుమారు 200మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్‌ అభిమానులు వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, వడ్డేపల్లి మండల అధ్యక్షుడు పరమేశ్వర్‌రెడ్డి, బీసీసెల్‌ జిల్లా నాయకుడు శ్రీనివాస్‌గౌడ్, నాయకులు హనుమంతు, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు