కోట్లాది ఆధార్‌, బ్యాంక్‌ నంబర్ల లీక్‌, షాకింగ్‌ రిపోర్టు

2 May, 2017 13:28 IST|Sakshi
కోట్లాది ఆధార్‌, బ్యాంక్‌ నంబర్ల లీక్‌, షాకింగ్‌ రిపోర్టు

ఆధార్‌ కార్డుల లీక్‌కు సంబంధించి మరోషాకింగ్‌ న్యూస్‌ వెలుగులోకి వచ్చింది. ఆధార్ డేటా లీక్ అయ్యే ఛాన్సే లేదని పదే పదే కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తున్నప్పటికీ  తాజా  పరిశోధన  భద్రతా వ్యవస్థలోని డొల్లతనాన్ని బయటటపెట్టింది.  జార్హండ్‌  లీక్‌  వ్యవహారం మర్చిపోకముందే  ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా మరోభారీ లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సుమారు 14కోట్లు (13కోట్ల 5లక్షల) ఆధార్‌కార్డులు,  పదికోట్లకు పైగా బ్యాంకు ఖాతాల సమాచారం లీక్‌అయిందని తాజా రిపోర్ట్‌ వెల్లడించింది.  ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల  నిర్లక్ష్యాన్ని ఎత్తి  చూపింది.  

సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ  సోమవారం విడుదల చేసిన  కొత్త పరిశోధనా నివేదిక ప్రకారం  కేంద్ర మంత్రిత్వశాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతారహిత సమాచార భద్రతా పద్దతుల ద్వారా 135 మిలియన్ల ఆధార్  నంబర్లు లీక్‌ అయ్యాయి. వివిధ రకాల  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాల అక్రమ భద్రతా పద్ధతుల కారణంగా గత రెండు నెలల్లో భారీగా డేటా బహిర్గతమైందని తెలిపింది.

 నాలుగు ప్రభుత్వ డేటాబేస్లను  ఇది  అధ్యయనం చేసింది. మొదటి రెండు గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందినవి. నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ (ఎన్ ఎస్ ఎ పి) డాష్‌బోర్డు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎన్.ఆర్.ఇ.జి.ఎ) పోర్టల్.

మిగిలిన రెండు  డేటాబేస్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్నానికి చెందినవి.  రాష్ట్ర ప్రభుత్వ సొంత ఎన్ఆర్ఇజిఎ పోర్టల్ ,  రాష్ట్ర ప్రభుత్వ పథకానికి సంబంధించిన  ఆన్లైన్ డాష్‌ బోర్డ్‌ "చంద్రన్న బీమా" ది.
ఈనాలుగు పోర్టల్స్‌ దవ్ఆరా 130-135  మిలియన్లదాకా ఉండొచ్చని అంచనా వేసింది. అలాగే   వంద మిలియన్లు(కోటి) దాకా  బ్యాంక్‌ ఖాతా నెంబర్లు బహిర్గతమయ్యాయని  అధ్యయన వేత్తలు అంబర్‌ సిన్హా , కొడాలి శ్రీనివాస్‌ తెలిపారు. ఈ డేటా లీక్‌  లో యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడిఎఐ)  పాత్రపై విశేషంగా  ప్రస్తావించారు.

ప్రభుత్వ సంస్థల ప్రామాణికతలేని విధానాలు,  భద్రత ,  గోప్యతకు భరోసా ఇవ్వడంలో బాధ్యతా రాహిత్యం దీనికి కారణమని వాదించారు.   దీంతో ఈ డేటా దుర్వినియాగానికి దారి తీయనుందని నివేదిక పేర్కొంది. ఈ ప్రభుత్వ డేటాబేస్ ఇప్పటికీ డేటా లీక్‌ ను అరికట్టిందా లేదా అనేది కీలకమైన ప్రశ్నఅని చెప్పింది. అయిదే తమ పరిశోధన కొనసాగుతుడగా పిఐఐ (వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారం) కి కొంత భద్రత కల్పించినట్టు గమనించామన్నారు. ఇటీవల ఆధార్‌ లీక్‌ లపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో డేటాబేస్‌ సంస్థలు  స్పందిచినట్టు  చెప్పింది.

కాగా ఇటీవల జార్ఖండ్‌ ప్రభుత్వ విభాగ వెబ్‌సైట్‌లో లక్షలాది మంది పెన్షన్‌ లబ్ధిదారుల ఆధార్, మొబైల్‌ నంబర్లు, బ్యాంకు ఖాతా వివరాలు వెల్లడైన నేపథ్యంలో కేంద్రం స్పందించింది.  రాష్ట్రప్రభుత్వాలకు చెందిన పలు ప్రభుత్వవిభాగాల వెబ్‌సైట్లలో లబ్ధిదారుల ఆధార్‌ కార్డు, వ్యక్తిగత వివరాలు బహిర్గతమైతే కఠిన చర్యలు తప్పవని రాష్ట్రాలను హెచ్చరించింది. అంతేకాదు మూడేళ్ల జైలు శిక్ష తప్పదని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు