అమెజాన్ మరో పైత్యం

20 Jan, 2017 13:00 IST|Sakshi
అమెజాన్ మరో పైత్యం

చండీఘడ్: ఇ-కామర్స్  దిగ్గజం అమెజాన్ తన పైత్యాన్ని మరోసారి చాటుకుంది. ఎన్ని హెచ్చరికలు చేసినా.. త‌ప్పులు మీద త‌ప్పు లు చేస్తూ అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదిర్శిస్తోంది. తాజాగా ఏకంగా వినాయ‌కుడి బొమ్మలున్న స్కేట్  బోర్డుల‌ను విక్రయానికి పెట్టింది.    దీంతో  నెటిజ‌న్లు  ఆగ్రహం వ్యక్తం  చేస్తున్నారు.

అమెజాన్ తీరుకు నిరసనగా  చండీగ‌ఢ్‌కు చెందిన న్యాయ‌వాది అజ‌య్ జ‌గ్గా స్పందించారు.  స్కేట్ బోర్డుల‌పై గణపతి  బొమ్మలను ముద్రించడంపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. వెంట‌నే  అమెజాన్ పై  తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  వెబ్‌సైట్ నుంచి వాటిని తొల‌గించాలని, దేశ ప్రజలకు  క్షమాప‌ణలు చెప్పించాల‌ని డిమాండ్ చేశారు.  ఈ చర్య భారతీయ శిక్షాస్మృతి లోని సెక్షన్ 295  ప్రకారం  శిక్షార్హమని తెలిపారు.  భారతీయుల మనోభావాలనుదెబ్బతీసిన అమెజాన్‌పై వెంట‌నే ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని కోరారు.

కాగా ఇటీవల అమెజాన్ భార‌తీయుల మ‌నోభావాలను దెబ్బతీస్తూ వెబ్ సైట్ లో  వస్తువులను విక్రయానికి పెట్టింది.  జాతీయ ప‌తాకాన్ని ముద్రించిన డోర్‌మ్యాట్ల‌లు ఆ  తర్వాత మ‌హాత్మాగాంధీ ఫొటో ముద్రించిన చెప్పుల‌ను వెబ్‌సైట్‌లో పెట్టింది.   దీనిపై కేంద్ర విదేశామంత్రి  సుష్మా స్వరాజ్ సీరియస్ గా స్పందించిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు