అమర్నాథ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్

19 Jul, 2013 16:25 IST|Sakshi
అమర్నాథ్ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్

జమ్మూ : జమ్ముకాశ్మీర్‌లోని రాంబన్‌లో అల్లరిమూకలపై బిఎస్పీ జవాన్ల కాల్పుల నేపధ్యంలో అమర్‌నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. బిఎస్పీ జవాన్ల కాల్పుల్లో నలుగురు ఆందోళనకారులు మరణించడంతో హురియత్‌ కాన్ఫరెన్స్‌ మూడు రోజుల పాటు ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రంలో పలు చోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి.

 

శ్రీనగర్‌తో పాటు జమ్ము- శ్రీనగర్‌ జాతీయ రహదారిపై నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ కారణంగా కాశ్మీర్‌ లోయతో పాటు రాంబన్‌ జిల్లాలో కర్ఫ్యూ విధించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అమర్‌నాథ్‌ యాత్రను నిలిపివేశారు. వెయ్యి మంది యాత్రికులు జమ్మూలోని సీఆర్పీఎఫ్ క్యాంపుల్లో వేచి ఉన్నారు.

మరిన్ని వార్తలు