10 నుంచి హజారే నిరవధిక దీక్ష

29 Nov, 2013 01:53 IST|Sakshi
10 నుంచి హజారే నిరవధిక దీక్ష

రాలేగావ్‌సిద్ధి (మహారాష్ట్ర): ప్రముఖ సామాజిక కార్యకర్త, గాంధేయవాది అన్నా హజారే మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. పటిష్ట లోక్‌పాల్ బిల్లు కోసం డిసెంబర్ 10 నుంచి ఆయన నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించనున్నారు. హజారే స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలోని యాదవ్‌బాబా ఆలయం వేదికగా ఆయన దీక్ష చేపట్టనున్నారు. గురువారం అన్నా హజారే రాలేగావ్‌సిద్ధిలో విలేకరులతో మాట్లాడారు. డిసెంబర్ 5 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పటిష్ట లోక్‌పాల్ బిల్లును తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తెగువ చూపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు హజారే లేఖ రాశారు. అవినీతికి అడ్డుకట్టవేసే వ్యవస్థను తేవడంలో కేంద్రం విఫలం కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు