గూగుల్‌లో ఎన్నికల సమాచారం!

29 Nov, 2013 01:48 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ తన సెర్చ్ ఇంజిన్‌లో ఫేస్‌బుక్ తరహాలో గురువారం ‘ఎలక్షన్ పోర్టల్’ను ప్రారంభిం చింది. దీని ద్వారా భారత్‌లో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపింది. తొలిదశలో ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాలకు చెందిన ఎన్నికల సమాచారాన్ని, వీడియోలను అందుబాటులో ఉంచినట్టు పేర్కొంది. సమాచారం మొత్తం హిందీ, ఆంగ్ల బాషల్లో ఉంటుందని, సందేహాలకు సమాధానాలు సైతం పొందే వీలుందని వివరించింది.

మరిన్ని వార్తలు