పూంఛ్ ప్రాంతాన్ని సందర్శించిన ఆర్మీచీఫ్ బిక్రం సింగ్

7 Aug, 2013 15:30 IST|Sakshi
పూంఛ్ ప్రాంతాన్ని సందర్శించిన ఆర్మీచీఫ్ బిక్రం సింగ్

పూంచ్ జిల్లాలో భారత సైనికులపై పాకిస్థాన్ మూకలు కాల్పులు జరిపి హతమార్చిన సంఘటనపై వాస్తవాలు పరిశీలించి, పూర్వాపరాలు తెలుసుకునేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రం సింగ్ బుధవారం అక్కడకు చేరుకున్నారు. నియంత్రణ రేఖ వద్ద పరిస్థితిని కూడా ఆయన సమీక్షించనున్నారు. జనరల్ సింగ్ ముందుగా పూంఛ్ జిల్లాతో పాటు జమ్ము ప్రాంతంలో నియంత్రణ రేఖను పరిరక్షించే 16 కోర్ దళం ప్రధాన కార్యాలయం ఉన్న నగ్రోటాను సందర్శించారు.

అనంతరం రాజౌరి వెళ్లి అక్కడ డివిజన్ ప్రధాన కార్యాలయంలో ఉన్న పలువురు సీనియర్ ఆర్మీ అధికారులతో భేటీ అయ్యారు. అనంతరం పూంఛ్ వద్దకు వెళ్లి అక్కడ నియంత్రణ రేఖ సమీపంలో భద్రత పరిస్థితిని సమీక్షించారు.  పాకిస్థానీ సైనిక దుస్తులలో ఉన్న దాదాపు 20 మంది వచ్చి పూంఛ్ సెక్టార్లోని చకన్ దా బాగ్ ప్రాంతంలో భారత సైనికులపై కాల్పులు జరిపి ఐదుగురిని హతమార్చిన విషయం తెలిసిందే. ఈ సంఘటన నేపథ్యంలో భారత సైన్యంలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు, వారికి అండగా ఉండేందుకు బిక్రం సింగ్ అక్కడకు వెళ్లారు.

>
మరిన్ని వార్తలు