నేను చనిపోతే దానికి సీఎంయే భాద్యులు..

9 May, 2017 18:55 IST|Sakshi
నేను చనిపోతే దానికి సీఎంయే భాద్యులు..

బనశంకరి: బెంగళూరులో ఇటీవల రౌడీషీటర్‌ వి.నాగరాజు అలియాస్‌ బాంబ్‌ నాగ ఇంట్లో రూ. 14.80 కోట్ల పాత నోట్లు దొరికిన కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఆ కేసులో అప్పటినుంచి పరారీలోనున్న నాగరాజు ఒక వీడియోను విడుదల చేశాడు. నాలుగు నిమిషాల వీడియోలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో పాటు, సీఎం సిద్ధరామయ్యతో పాటు మంజునాథ్, మరో ఐదుగురు ప్రైవేటు వ్యక్తుల పేర్లను ప్రస్తావించాడు. 

మంగవారం మరో సీడీ ని బాంబ్‌ నాగ విడుదల చేశాడు. ఆ సీడీలో రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర్‌ చెబితే పదినిమిషాల్లో పోలీసుల ముందు లొంగిపోతానంటూ రౌడీ నాగరాజ్‌ అలియాస్‌ బాంబ్‌ నాగ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన మంగళవారం లాయర్‌ శ్రీరామరెడ్డితో రెండవ సీడీ విడుదల చేయించాడు. ఆ సీడీలో కొన్ని సంచలనం రేకేత్తించే విషయాలు బాంబ్‌నాగ చెప్పాడు.  మంత్రి పరమేశ్వర్‌కు మాత్రమే తన భాద అర్థమైందని రౌడీ నాగ సీడీలో అన్నాడు. నేను చనిపోతే దానికి సిద్ధరామయ్యనే భాద్యులని  తెలపారు. విదానసౌధ ముందు చనిపోతానని తన చావుకు సిద్ధరామయ్య కారణమన్నారు. విధానసౌధ వద్దకు వచ్చి ఏ అఘాయిత్యానికైనా పాల్పడాతనని తెలిపారు.

చెడు  ఐపీఎస్‌ అధికారులను సీఎం తొలగించాలని అన్నాడు. రౌడీనాగ పట్ల సీబీఐ విచారణ చేపడితే రాష్ట్రం పరువు పోతుందని పేర్కొన్నాడు. మీరు సీఎం రాష్ట్రం పరువు పోకుండా కాపాడాలని బాంబు నాగ మనవి చేశారు. తాను తమిళనాడులో పుట్టడమే నేరమని, బెంగుళూరు తమిళులు తనకు మోసం చేశారని ఆరోపించారు. తనను ఎమ్మెల్యేగా  గెలిపించకుండా మోసం చేశారని వాపోయారు. వచ్చే 2018 ఎన్నికల్లో పోటీచేయనని తెలిపారు.  ప్రస్తుతం తను ఈ  పరిస్థితిలో ఉండటానికి తమిళులే కారణమని ఆవేదన వ్యక్తం చేశాడు. తనపై 40 నుంచి 50 కేసులు ఉన్నాయని మీడియాలో వార్తలు రావటం అవాస్తవం అన్నారు.

కానీ తనపై ఎలాంటి కేసుల లేవని, రూ. 100, 200 జరిమానా చెల్లించిన కేసులు అని స్పష్టం చేశారు. తనకు రౌడీ అనే పదానికి అర్థమే తెలియదన్నారు. కొంతమంది సీనియర్‌ అధికారలు పాతనోట్ల దందాలో భాగస్వాములుగా ఉన్నారిని బాంబ్‌నాగ ఆరోపించారు. పోలీసులు జీతాలు చాలకపోవడంతో దందాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేయడంతో బాంబ్‌ నాగ కేసు సవాల్‌గా మారింది. బాంబ్‌నాగ కేసులో చట్టం తన పని తాను చేపుకుపోతుందని హోంమంత్రి పరమేశ్వర్‌ మంగళవారం స్పష్టం చేశారు.
 

మరిన్ని వార్తలు