2050 నాటికి కరగడం రెండింతలు!

14 Oct, 2015 04:18 IST|Sakshi
2050 నాటికి కరగడం రెండింతలు!

వాషింగ్టన్: అంటార్కిటిక్‌లో 2050 సంవత్సరం నాటికి మంచు కరగడం రెండింతలయ్యే అవకాశం ఉందట. గ్రీన్‌హౌస్ వాయువుల విడుదల ప్రస్తుత నిష్పత్తిలోనే కొనసాగితే అంటార్కిటిక్‌లో మంచుపలకలు కుప్పకూలుతాయట. ఈ విషయాలు అమెరికా పరిశోధకుల అధ్యయనంలో వెల్లడయ్యాయి. అయితే మంచు కరగడం వల్ల, పలకలు విడిపోవడం వల్ల నేరుగా సముద్రాల నీటిమట్టం పెరగదని, విడిపోయిన పలకలు సముద్రంలోకి చేరిన తర్వాత కరగడం మొదలవుతుందని, ఆ తర్వాతే సముద్ర నీటి మట్టం పెరుగుతుందని తెలిపారు.

వాతావరణ కాలుష్యం వల్ల అంటార్కిటిక్‌లో మంచు ఎంత వేగంగా కరుగుతుందనే అంశంపై తాము అధ్యయనం చేశామని అమెరికాలోని వుడ్స్ హోల్ ఓషనోగ్రఫీ ఇనిస్టిట్యూషన్ పోస్ట్ డాక్టరేట్ స్కాలర్ లూక్ ట్రసెల్ తెలిపారు.

మరిన్ని వార్తలు