-
మంచు పడవ..కేవలం శిల్పం కాదు! అలా నీటిలో చక్కర్లు కొట్టేయొచ్చు!
మంచుతో రకరకాల కట్టడాల నమూనాలను, శిల్పాలను రూపొందించడం తెలిసిందే! ఇవాన్ కార్పిత్స్కీ అనే బెలారష్యన్ కళాకారుడు ఏకంగా మంచుపడవనే రూపొందించాడు. ఇది పడవ ఆకారంలో రూపొందించిన కళాఖండం కాదు, నీళ్లల్లో ప్రయాణించగలదు. హిమశిల్పాలంటే విపరీతమైన ఇష్టం ఉన్న ఇవాన్, ఏళ్ల తరబడి కఠోర సాధన చేసి రకరకాల హిమశిల్పాలను రూపొందిస్తుంటాడు. అవి కేవలం శిల్పాల్లాగానే కాదు, అచ్చంగా అసలు వాటిలా పనిచేసేలా రూపొందించడమే ఇవాన్ ప్రత్యేకత! తొలిసారిగా 2020లో అతడు మంచుతో వయోలిన్ తయారు చేసి, వార్తలకెక్కాడు. ఇక అప్పటి నుంచి ప్రతి ఏటా శీతకాలంలో మంచుగడ్డ కట్టే ప్రదేశాలకు వెళ్లి, అక్కడ మంచు శిల్పాలను తయారు చేయడం అలవాటుగా చేసుకున్నాడు. ఈసారి శీతకాలంలో ఈ మంచుపడవను తయారు చేశాడు. బెలారష్యా రాజధాని మిన్స్క్ నగరానికి చేరువలో ఉండే స్న్యాన్స్కో రిజర్వాయర్ ఒడ్డున కూర్చుని ఇవాన్ ఈ పడవను తయారు చేశాడు. తయారీ పూర్తయ్యాక మంచుపడవలో కూర్చుని రిజర్వాయర్ నీటిలో చక్కర్లు కొట్టాడు. (చదవండి: ఆ గుహలోకి వెళ్లడమంటే.. ప్రాణాలపై ఆశ వదిలేసుకోవడమే!) -
మంచుతో నిప్పు పుట్టించవచ్చా? అదెలా సాధ్యం?
నిప్పు- నీరు ఒకదానికొకటి పూర్తిగా భిన్నమైనవి. నిప్పు ఉన్న చోట నీరు ఉండదు. నీరు ఉన్న చోట నిప్పు ఉండలేదు. అయితే ఐస్‌తో కూడా నిప్పు పెట్టొచ్చని చెబితే నమ్ముతారా? సైన్స్ సహాయంతో ఈ అద్భుతం ఎలా జరుగుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం. సైన్స్ చేసే ఈ అద్భుతం 6వ తరగతి పుస్తకంలో దాగి ఉంది. ఈ ప్రయోగం కుంభాకార లెన్స్ చుట్టూ తిరుగుతుంది. లెన్స్ ఉపయోగించి సూర్యకాంతి సహాయంతో నిప్పును మండించడాన్ని మీరు చూసే ఉంటారు. మంచుతో నిప్పును పుట్టించే ప్రయోగం కూడా ఇలానే సాగుతుంది. మంచుతో నిప్పు పుట్టించాలంటే ముందుగా పారదర్శక మంచు అవసరం. ఈ పారదర్శక మంచు ముక్క కుంభాకార లెన్స్ మాదిరిగా పని చేస్తుంది. ఈ మంచు ముక్క నుంచి సూర్యకాంతిని బయటకు ప్రసరింపజేసి, అది కాగితంపై పడేలా చేస్తే, కొంత సమయం తరువాత ఆ కాగితం నుండి పొగ రావడం ప్రారంభమవుతుంది. తరువాత కాగితంపై మంటలు వ్యాపించడాన్ని గమనించవచ్చు. మంచును కుంభాకార లెన్స్‌గా ఉపయోగించి, మంటలను పుట్టించవచ్చని తెలుసుకున్నాం. అయితే మంచును కుంభాకార లెన్స్‌గా ఎలా తయారు చేయాలనే ప్రశ్న ఎదురవుతుంది. ఇందుకోసం ముందుగా పారదర్శక మంచు ముక్కను తీసుకోవాలి. చాకు సాయంతో ఆ మంచుకు లెన్స్ ఆకారాన్ని ఇవ్వాలి. తర్వాత చేతులతో రుద్ది లెన్స్ మాదిరిగా తయారు చేయాలి. లెన్స్ ఎంత పెద్దదిగా ఉంటే నిప్పు అంత ప్రకాశవంతంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. లెన్స్ మందం 2 అంగుళాలు, వ్యాసం 6 అంగుళాలు ఉంటే అప్పుడు నిప్పు వేగంగా వ్యాపిస్తుంది. -
గడ్డకట్టిన మంచుతో భారీ రెస్టారెంట్.. ఎక్కడో తెలుసా?
గడ్డకట్టిన మంచుతో శిల్పాలు చెక్కి ప్రదర్శనకు పెట్టడం చలి ప్రదేశాల్లో మామూలే! స్వీడన్లోనైతే ఏకంగా గడ్డకట్టిన మంచుతో ఒక భారీ హోటల్‌నే నిర్మించారు. ఇందులోని మంచాలు, కుర్చీలు, బల్లలు వంటివన్నీ గడ్డకట్టిన మంచుతో తయారు చేసినవే కావడం విశేషం. జేమ్స్‌బాండ్ సినిమా ‘డై ఎనదర్ డే’లో కనిపించిన భవంతి నమూనా ఆధారంగా ఈ హోటల్‌ను నిర్మించడం విశేషం. టోర్నె నదిలో గడ్డ కట్టిన మంచును తవ్వి తెచ్చి, నదికి సమీపంలోనే దీనిని ఐదువందల టన్నుల మంచుతో నిర్మించారు. ఇందులో పన్నెండు ఆర్ట్ స్వీట్రూమ్స్, ఒక డీలక్స్ స్వీట్‌రూమ్, థీమ్డ్ రూమ్‌లు, బార్ సహా పలు వసతులు ఉన్నాయి. ఈ హోటల్లో పది ఒలింపిక్ స్విమింగ్ పూల్స్, ముప్పయిమూడు చిన్న స్విమింగ్‌పూల్స్ కూడా ఉన్నాయి. లూకా రోంకొరోని నేతృత్వంలో ఇరవై నాలుగు మంది హిమశిల్పులు దీనిని నిర్మించారు. దీని లోపలి భాగంలో ఉష్ణోగ్రత మైనస్ ఐదు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటుంది. ఇది ఏడాది పొడవునా అతిథులకు అందుబాటులో ఉంటుంది. -
4 డిగ్రీల చలిలో సమంత ఐస్‌బాత్.. ఎందుకలా?
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెకేషన్ మోడ్‌లో ఉన్నారు. స్నేహితులతో కలిసి ఇండోనేషియాలోని బాలిలో ఎంజాయ్ చేస్తోంది. అక్కడి వింత ప్రదేశాలను సందర్శిస్తూ వాటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ నాలుగు డిగ్రీల చలిలో ఆరు నిమిషాల పాటు ఐస్‌బాత్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోని ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. ‘మయోసైటిస్ చికిత్సలో భాగంగా ఈ ఐస్‌బాత్ థెరపీ చేసుకున్నారా?’అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. కాగా, గతంలో కూడా సామ్ ఐస్‌బాత్ చేసింది. ఐస్ గడ్డలు ఉన్న టబ్‌లో కూర్చొని ‘ఈ ఐస్ బాత్ రికవరీ సమయం తీవ్రంగా బాధిస్తుంది’అని అప్పట్లో పేర్కొంది. (చదవండి: బుల్లితెర నటి ఐవీఎఫ్.. నాలుగో ప్రయత్నంలో విజయం.. కానీ..) ఐస్ బాత్ ఎందుకు చేస్తారు? చల్లటి నీటిలో కాసేపు అలానే ఉండటం ఐస్‌బాత్. క్రీడాకారులు, అధికంగా జిమ్ చేసేవారు అప్పుడప్పుడు ఐస్‌బాత్ చేస్తుంటారు. అలా చల్లటి నీటిలో కూర్చోవడం వల్ల వ్యాయామం చేసి అలసిపోయిన కండరాలు త్వరగా రిలాక్స్డ్ స్థితిలోకి వస్తాయి. అలాగే రక్త ప్రసరణ సులభతరం అవుతుంది. హృదయ స్పందన రేటు సరిగా ఉంటంది. శ్వాసపై నియంత్రణ పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. సమంత ఎక్కువగా వ్యాయామం చేస్తుంది. అందుకే ఆమె ఐస్‌బాత్ చేసి ఉండోచ్చు. సినిమాలకు బ్రేక్ సమంత దాదాపు ఏడాది కాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా సమంత తరచూ అనారోగ్యానికి గురవుతుంది. అందుకే కొంతకాలం వరకు సినిమాలకు బ్రేక్ ఇచ్చి, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సమంత నిర్ణయించుకున్నారట. అందుకే ఇప్పటికే తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి నిర్మాతలకు అప్పగిస్తున్నారట. ఏడాది కాలం పూర్తిగా తన వ్యక్తిగత జీవితంపై దృష్టిపెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె నటించిన సిటడెల్ వెబ్ సిరీస్‌తో పాటు ఖుషి సినిమా విడుదలకు రెడీగా ఉన్నాయి. ఈ రెండు రిలీజ్ అయిన తర్వాత సమంత ఇక వెండితెరపై కనిపించదు. ఆమెను మళ్లీ తెరపై చూడాలంటే కనీసం ఏడాదిన్నర ఆగాల్సిందే. -
గడ్డకట్టిన నయాగరా జలపాతం.. అద్భుత దృశ్యాలు
న్యూయార్క్: అమెరికాలో మంచు తుపాను(Bomb cyclone) విలయం కొనసాగుతూనే ఉంది. ఈ శతాబ్దంలోనే ఎన్నడూ ఎరుగనటువంటి చలి గాలులు, విపరీతంగా కురుస్తోన్న మంచు ధాటికి దేశమంతా అతలాకుతలమైంది. 4వేలకుపైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల దేశవ్యాప్తంగా 60 మందికిపైగా మరణించారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోవటంతో పలు ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లాయి. ముఖ్యంగా న్యూయార్క్, బఫెలో కౌంటీలో నెలకొన్న దుర్భర పరిస్థితులను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న చిత్రాలు, వీడియోలు చూపుతున్నాయి. బఫెలో కౌంటీలో వాహనాల్లోనే గడ్డకట్టుకుపోయి మరణించిన సంఘటనలూ ఉన్నాయి. అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లో నమోదవుతున్నాయి. దీంతో నయాగరా జలపాతం గడ్డకట్టుకుపోయింది. దీంతో పర్యాటకులు ఈ అద్భుత దృశ్యాన్ని చూసి ముగ్ధులైపోతున్నారు. నయాగరాకు 25 మైళ్ల దూరంలో బఫెలో ఉంటుంది. అయితే, నయాగరాలో కొన్ని ప్రదేశాల్లో నీరు గడ్డకట్టినా.. ప్రవాహం కారణంగా కొన్ని చోట్ల మాత్రం జలపాతం పరవళ్లు తొక్కుతోంది. గట్టకట్టుకుపోయిన నయాగరా జలపాతం ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. నయాగరా ఫాల్స్ న్యూయార్క్ స్టేట్ పార్క్ ప్రకారం ప్రతి సెకనుకు 3,160 టన్నుల నీరు జలపాతం నుంచి పడుతుంది. ఈ నీరు ప్రతి సెకనుకు 32 అడుగుల వేగంతో ప్రయాణిస్తుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పడిపోయిన సందర్భాల్లో నయాగరా నదిపై మంచు గడ్డకడుతుందని అధికారులు తెలిపారు. ఇలా మంచుతో ఏర్పడిన బ్రిడ్జ్‌పై నడవటాన్ని నిషేధించారు. 1912, ఫిబ్రవరి 4 నయాగరా నదిపై ఏర్పడిన మంచు వంతెనపైకి వెళ్లి ముగ్గురు చనిపోయిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. The day after the great freeze, my family and I went to #NiagraFalls. The #NiagraRiver below it had ice thick enough for you *to technically* get to #Buffalo, #NewYork by foot! Was it an intriguing and surreal Arctic experience for a kid from California, yes! pic.twitter.com/MAC8IIfjZc — Escondido Weather Observer (CoCoRaHs: CA-SD-197) (@KCAESCON230) December 23, 2022 ఇదీ చదవండి: Bomb Cyclone: అమెరికాలో కొనసాగుతున్న మంచు విలయం
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్‌లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్‌లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్‌కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- భారత్‌లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement