కంప్లి ఎమ్మెల్యే సురేష్ బాబు అరెస్టు

19 Sep, 2013 22:26 IST|Sakshi

కర్ణాటకలోని కంప్లి ఎమ్మెల్యే, బీఎస్సార్ పార్టీ అధ్యక్షుడు బి.శ్రీరాములు మేనల్లుడు సురేష్ బాబును సీబీఐ వర్గాలు అరెస్టు చేశాయి. కర్ణాటకలోని బెలెకెరి పోర్టు నుంచి ఇనుప ఖనిజం అక్రమ ఎగుమతుల కేసులో ఆయన్ను అరెస్టు చేశారు. శుక్రవారం ఆయనను సీబీఐ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెడతారు.

గురువారం నాడు సుదీర్ఘంగా సురేష్ బాబును ప్రశ్నించిన తర్వాత ఆయన్ను అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. ఉత్తర కన్నడ జిల్లాలోని బెలెకెరి పోర్టు నుంచి అక్రమంగా ఇనుప ఖనిజం ఎగుమతికి సంబంధించిన వివరాలను కర్ణాటక మాజీ లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డే బయటపెట్టారు. 2006-07, 2010-11 సంవత్సరాల మధ్య దాదాపు 77.4 కోట్ల టన్నుల ఇనపు ఖనిజం అక్రమంగా ఎగుమతి అయ్యిందని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డికి శ్రీరాములు, సురేష్ బాబు ఇద్దరూ సన్నిహితులేనన్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు