పట్నవాసులకూ జీవనోపాధి రుణాలు!

30 Sep, 2013 03:50 IST|Sakshi

ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం  
పట్టణాల్లోని యువకులు, పురుషులు, మహిళలకు వ్యక్తిగత, బృంద రుణాలు రూ. 2లక్షల వరకూ వ్యక్తిగత రుణాలు, రూ.10 లక్షల వరకూ బృంద రుణాలు రుణాలపై వడ్డీ పురుషులకు 7%, మహిళలకు 4%.. గడువులోగా తిరిగి చెల్లిస్తేనే వడ్డీ రాయితీ వచ్చే మార్చి నుంచి దేశవ్యాప్తంగా 786 పట్టణాల్లో అమలు.. రాష్ట్రంలోని 46 పట్టణాల ఎంపిక సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంటు ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ కేంద్రం పట్టణ ప్రాంతాల్లోని ప్రజలను ఆకర్షించడానికి మరో కొత్త రుణపథకానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలయ్యే ఈ పథకానికి జాతీయ పట్టణ జీవనోపాధి పథకం అని పేరుపెట్టారు. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌ నాటికి దీన్ని అమల్లోకి తేవాలని కేంద్రం సంకల్పించింది.

ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. గ్రామాల నుంచి పట్టణాలకు, నగరాలకు వలస వచ్చే వారికి తగిన జీవనోపాధి కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. జీవనోపాధికి సంబంధించిన శిక్షణ పొందిన వారికి రూ. 2లక్షల వరకూ వ్యక్తిగత రుణాలు.. రూ. 10లక్షల వరకూ బృంద రుణాలను మంజూరు చేస్తారు. మహిళా స్వయం సహాయక బృందాల మాదిరిగానే యువకులు, పురుషులతోనూ బృందాలను ఏర్పాటు చేస్తారు. లబ్ధిదారులకు ముందుగా జీవనోపాధి శిక్షణ ఇస్తారు. యువకులు, పురుషులకు 7% వడ్డీకి, మహిళలను 4% వడ్డీపై రుణాలు మంజూరు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అయితే, బ్యాంకుల తీసుకునే రుణాలను సకాలంలో చెల్లించే లబ్ధిదారులకే వడ్డీలో రాయితీ వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ పథకాన్ని మొదటి దశలో లక్షకు మించిన జనాభా కలిగిన పట్టణాల్లో అమలు చేస్తారు.

లక్ష కంటే తక్కువ జనాభా ఉన్న జిల్లా కేంద్రాల్లోనూ దీనిని అమలు చేస్తారు. దేశంలో లక్షకు పైగా జనాభా ఉన్న 786 పట్టణాల్లో, రాష్ట్రంలోని 46 పట్టణాల్లో ఈ పథకం అమలుకానుంది. లక్ష జనాభా ఉన్న పట్టణాల్లో రిసోర్‌‌స ఆర్గనైజేషన్‌(ఆర్వో)లను ఏర్పాటు చేసి.. జీవనోపాధి బృందాల బాధ్యత అప్పగిస్తారు. లక్ష నుంచి మూడు లక్షల జనాభా ఉన్న పట్టణాల్లో సిటీ లెవల్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. పది లక్షల కన్నా అధిక జనాభా కలిగిన నగరాల్లో 8 చొప్పున సీఎల్‌సీలు ఏర్పాటు చేస్తారు. ఈ పథకం కింద రుణాలు పొందిన వ్యక్తులు, బృందాలు ఉత్పత్తి చేసే వస్తువుల మార్కెటింగ్‌కు సదుపాయాలు కల్పించడంపై కూడా ప్రభుత్వం దృష్టిసారిస్తుంది. అలాగే ప్రతి పట్టణంలోనూ నిలువ నీడ లేని వారికి ఆశ్రయం కల్పించడానికి ఆల్‌ వెదర్‌ షెల్టర్‌‌సను నిర్మించాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. 50 నుంచి 100 మంది ఉండడానికి వీలుగా వీటిని నిర్మించి, పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు కేటాయిస్తుంది. మిగిలిన 10 శాతం నిధులను లేదా షెల్టర్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది
 

మరిన్ని వార్తలు