వీడియో కాన్ఫెరెన్స్‌ పెళ్లి!

9 May, 2017 13:02 IST|Sakshi
వీడియో కాన్ఫెరెన్స్‌ పెళ్లి!

ముజాఫర్‌నగర్‌: సాంకేతిక పరిజ్ఞానంతో చాలా సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచం మొత్తం అరచేతిలో ఇమిడిపోతోంది. టెక్నాలజీ మనుషుల మధ్య దూరాన్ని తగ్గించడమే కాదు ఏకం చేస్తోంది కూడా. ఉత్తరప్రదేశ్‌లోని షామ్లి జిల్లాలో జరిగిన పెళ్లి క్రతువే ఇందుకు నిదర్శనం. ముస్లిం యువతికి సౌదీ అరేబియాలోని వరుడితో వీడియో కాన్ఫెరెన్స్‌లో ఈ తతంగం జరిపించారు.

వరుడు సమయానికి ఇక్కడి చేరుకునే పరిస్థితులు లేకపోవడంతో సాంకేతికత సహాయంలో మత పెద్దలు పెళ్లి క్రతువు నిర్వహించారు. ముందుగా నిశ్చయించిన ముహుర్తం ప్రకారం మే 5న పెళ్లి జరగాల్సివుంది. అయితే పెళ్లికొడుకు సమయానికి చేరుకునే పరిస్థితులు లేకపోవడంతో టెక్నాలజీని ఆశ్రయించినట్టు వధువు తండ్రి రెహాన్‌ తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌  ద్వారా సోమవారం వివాహ క్రతువు జరిపినట్టు వెల్లడించారు. వధూవరుల బంధుమిత్రుల సమక్షంలో ఈ పెళ్లి తంతు జరిపిం​చడం విశేషం.

మరిన్ని వార్తలు