కోర్ కమిటీ భేటీ ప్రారంభం.. రాయల తెలంగాణపై చర్చ

29 Nov, 2013 18:13 IST|Sakshi

తెలంగాణ అంశంపై నిమిషానికో మాటతో గందరగోళం సృష్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఈ విషయమై మరింత స్పష్టత కోసం కోర్ కమిటీలో చర్చలు మొదలుపెట్టింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో కోర్ కమిటీ సమావేశం శుక్రవారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితునిగా కేంద్ర మంత్రి కమల్నాథ్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాయల తెలంగాణ, హైదరాబాద్ అంశాలపైనే చర్చ ఉంటుందని భావిస్తున్నారు. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే ఆలోచన ఏమాత్రం లేదని చెబుతున్నా, ఈ నగరం విషయంలో ఏం చేయాలన్న నిర్ణయం మాత్రం ఇంతవరకు తీసుకోలేకపోయారు. అందుకే దీని గురించి ఈ భేటీలో ముమ్మరంగా చర్చిస్తున్నారు.

ఇక విభజన గురించి ప్రభుత్వపరంగా నియమించిన కేంద్ర మంత్రివర్గం (జీవోఎం) రూపొందించిన నివేదికకు కూడా కోర్ కమిటీ రాజకీయ పరంగా క్లియరెన్స్ ఇవ్వనుంది. వీటితో పాటు పార్లమెంటు శీతాకాల సమావేశాలలో తెలంగాణ బిల్లును ఎప్పుడు ప్రవేశపెట్టాలన్న విషయంపై కూడా ఈ కోర్ కమిటీ భేటీలోనే చర్చించబోతున్నారు.

మరిన్ని వార్తలు