ట్రిబ్యునల్ తీర్పు బాధాకరం:హరికృష్ణ | Sakshi
Sakshi News home page

ట్రిబ్యునల్ తీర్పు బాధాకరం:హరికృష్ణ

Published Fri, Nov 29 2013 6:29 PM

harikrishna takes on congress over krishna water dispute

హైదరాబాద్: కృష్ణానది నీటి కేటాయింపులపై ఏర్పాటైన బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు ఆంధ్రప్రదేశ్ కు వ్యతిరేకంగా రావడం చాలా బాధాకరమని నందమూరి హరికృష్ణ తెలిపారు. కాంగ్రెస్ దుర్నీతితో వ్యవహరించడం వల్లే ఈ దుస్థితి సంభవించిందన్నారు.  ట్రిబ్యునల్ తీర్పుపై శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ అనుసరించిన నిర్లక్ష్య వైఖరితో ఇటువంటి పరిస్థితి దాపురించిందన్నారు.  నీటి వాటాల కోసం పోరాడాల్సిన కాంగ్రెస్ నేతలు విభజనకు సహకరిస్తున్నారన్నారని ఆయన మండిపడ్డారు.రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా అందరూ ఏకం కావాలని హరికృష్ణ పిలుపునిచ్చారు.

 

బ్రజేశ్‌కుమార్‌ మధ్యంతర తీర్పులో మన రాష్ట్రానికి వ్యతిరేకంగా అనేకాంశాలు చోటు చేసుకున్నాయి. మిగులు జలాల పంపిణీ, ఆలమట్టి ఎత్తు పెంపుపై రాష్ట్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయినా కూడా అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోకుండా తీర్పునివ్వడంతో కృష్ణా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని రాష్ట్ర నేతలు అభిప్రాయపడుతున్నారు.


 

Advertisement
Advertisement