జార్ఖండ్‌లో జేఎంఎంతో కాంగ్రెస్ కటీఫ్

1 Nov, 2014 01:01 IST|Sakshi

న్యూఢిల్లీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, జేఎంఎం పొత్తు విచ్ఛిన్నమైంది. దాదాపు 16 నెలలపాటు రాష్ట్రంలో అధికారాన్ని పంచుకున్న ఈ రెండు పార్టీలు ఇప్పుడు వేరయ్యాయి. జేఎంఎంతో పొత్తును తెంచుకున్నట్టు కాంగ్రెస్ శుక్రవారం ప్రకటించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బీకే హరిప్రసాద్ పీటీఐ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీ(యుూ) పార్టీలతో కలసి పోటీచేస్తావుని తెలిపారు. బీహార్లో ఆగస్టులో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్‌జేడీ, జేడీ(యూ)లు కలసి పోటీచేయడం తెలిసిందే.

 

మరిన్ని వార్తలు