'పరువు' పేరుతో.. ప్రేమికుల హత్య

12 May, 2015 18:16 IST|Sakshi
'పరువు' పేరుతో.. ప్రేమికుల హత్య

ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో పరువు హత్యకు ఓ జంట బలైంది. పరువు పేరుతో ప్రేమికులను కాల్చిచంపారు. లాహోర్ సబర్బన్ లోని చొహాంగ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని స్థానిక మీడియా వెల్లడించింది.

పంజాబ్ ప్రావిన్స్ లోని పాటొకీ ప్రాంతానికి చెందిన తాహిర్,  చొహాంగ్ ప్రాంతానికి చెందిన బాలిక ప్రేమించుకున్నారు. ప్రియురాలిని కలిసేందుకు తాహిర్ బాలిక ఇంటికి వచ్చాడు. వీరిద్దరూ కలిసివుండగా  బాలిక తండ్రి, ఇతర బంధువులు గమినించారు. ప్రేమికులిద్దరినీ అక్కడికడ్కడే కాల్చి చంపారని జియో న్యూస్ వెల్లడించింది.

బాలిక తండ్రి, మరో ఇద్దరినీ అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. హత్యకు వినియోగించిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. తమ అభిష్టానికి వ్యతిరేకంగా పెళ్లిచేసుకుందనే అక్కసుతో ఇదే కుటుంబానికి చెందిన మహిళను గర్బిణీ అని కూడా చూడకుండా హైకోర్టు ముందు ఇటుకలు, కర్రలతో కొట్టి చంపారు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు