హెటిరోతో...డాక్టర్ రెడ్డీస్ జట్టు

24 Mar, 2015 00:11 IST|Sakshi
హెటిరోతో...డాక్టర్ రెడ్డీస్ జట్టు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ హెపటైటిస్-సి వ్యాధి చికిత్సకు వినియోగించే సొవాల్డి జెనరిక్ వెర్షన్ ‘రిసాఫ్’ పేరుతో దేశీయ మార్కెటో విక్రయించనుంది. ఈ మేరకు హెటిరో ల్యాబ్‌తో డాక్టర్ రెడ్డీస్‌కి ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం హెటిరో ల్యాబ్ తయారు చేసే సోఫాస్‌బువిర్ 400 ఎంజీ ట్యాబ్లెట్లను రిసాఫ్ బ్రాండ్‌తో డాక్టర్ రెడ్డీస్ దేశీయ మార్కెట్లో విక్రయించనుంది.

రోగులకు అందుబాటు ధరలో ఔషధాలను అందించాలన్న కంపెనీ ఆలోచనలో భాగంగా ఈ ఒప్పం దాన్ని కుదుర్చుకున్నట్లు డాక్టర్ రెడ్డీస్ కో-చైర్మన్, సీఈవో జి.వి.ప్రసాద్ తెలిపారు. అమెరికాకు చెందిన గిలీడ్ సెన్సైస్ హెపటైటిస్ -సి చికిత్సకు వినియోగించే ట్యాబ్లెట్లను సొవాల్డి బ్రాండ్ నేమ్‌తో విక్రయిస్తోంది. ఈ మధ్యనే వీటి జెనరిక్ వెర్షన్‌ను విక్రయించడానికి హెటిరో ల్యాబ్‌తోపాటు నాట్కో, జైడస్ క్యాడిలాలకు అనుమతులు వచ్చిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు