తేజ్పాల్ బెయిల్ పిటిషన్పై విచారణ ప్రారంభం

30 Nov, 2013 12:04 IST|Sakshi
తేజ్పాల్ బెయిల్ పిటిషన్పై విచారణ ప్రారంభం

పణజీ :  తెహెల్కా  ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్‌పాల్‌ బెయిల్ పిటిషన్పై శనివారం గోవా కోర్టులో విచారణ ప్రారంభం అయ్యింది. తెహెల్కా  మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడి కేసులో ఆయనను శనివారం ఉదయం 10 గంటల వరకు పోలీసులు అరెస్టు చేయకుండా స్థానిక కోర్టు మధ్యంతర రక్షణ కల్పించిన విషయం తెలిసిందే.  కాగా  వాస్తవానికి శుక్రవారం ఉదయం తేజ్‌పాల్ అరెస్టుకు జడ్జి నాన్ బెయిల్బుల్ వారంట్లు జారీ చేశారు.

అయితే ఆయన తరఫు న్యాయవాదులు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో అరెస్టును మధ్యాహ్నం 2.30 వరకు వాయిదా వేశారు. ఉదయం నుంచి  హైడ్రామా, యూక్షన్ నేపథ్యంలో ఎట్టకేలకు తరుణ్ తేజ్‌పాల్‌కు గోవా కోర్టులో ఊరట లభించింది. ఆయన్ని ఈరోజు ఉదయం పది గంటల వరకూ అరెస్ట్ చేయకుండా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు తేజ్పాల్ ముందస్తు బెయిల్ పిటిషన్ నేపథ్యంలో గోవా కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. అంతకు ముందు తరుణ్ తేజ్ పాల్ విచారణ నిమిత్తం గోవా క్రైమ్ బ్రాంచ్ అధికారుల ఎదుట హాజరయ్యారు.

మరిన్ని వార్తలు