సహారాకు ఈడీ దెబ్బ

9 Feb, 2017 11:43 IST|Sakshi

న్యూఢిల్లీ : సహారా అధినేత సుబ్రతోరాయ్  మరిన్ని ఇబ్బందుల్లో చిక్కుకోనున్నారు. ఇటీవల ఆంబే వాలీని  అటాచ్‌ చేయాలంటూ ఆదేశించి సుప్రీంకోర్టు షాకివ్వగా ఇపుడు ఈడీ వంతు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి)తాజా నిర్ణయంతో మరిన్ని కష్టాలు   సహారాను చుట్టు ముట్టనున్నాయి. మనీలాండరింగ్‌ చట్టం కింద ఈడీ మరిన్ని విలువైన ఆస్తులను  స్వాధీనం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. సహారా గ్రూప్ హోటల్స్  సహా ఇతర విదేశీ  ఆస్తులను అటాచ్‌ కోసం ఈడీ  సిద్ధమవుతోంది.  సహారా హోటల్స్‌, విదేశాల్లో్ ఉన్న నాలుగు  ప్రాపర్టీల అటాచ్‌మెంట్‌కు రంగం సిద్ధం చేస్తోంది.  దాదాపు రూ. 3,697కోట్ల విలువైన ఈ ఆస్తుల  అటాచ్‌మెంట్‌కు  అనుమతి కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.  

ఈ ఆస్తులను సహారా  అక్రమంగా కూడబెట్టిందని  ఈడీ ఆరోపిస్తోంది. సుప్రీం అక్రమ ఆస్తులుగా ప్రకటించిన ఈ ప్రాపర్టీలనున  పెట్టుబడిదారుల పెట్టుబడుల నుంచి సంపాదించుకుందని ఈడీ నమ్ముతోంది.
 
కాగా  సహారా గ్రూప్ అంటే ఆంబేవాలీ.  అత్యంత విలువైన ఆస్తి విలువు రూ.39వేల కోట్లు. ఆంబే వాలీని అటాచ్ చేస్తున్నట్టు పేర్కొన్న  సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు