గౌరీలంకేశ్‌ హత్యపై దిగ్భ్రాంతి

6 Sep, 2017 14:30 IST|Sakshi
గౌరీలంకేశ్‌ హత్యపై దిగ్భ్రాంతి
  • తీవ్రంగా ఖండించిన జర్నలిస్టు సంఘాలు
  • సర్వత్రా పెల్లుబుక్కుతున్న నిరసన
  • న్యూఢిల్లీ: ప్రముఖ కన్నడ జర్నలిస్టు గౌరీలంకేశ్‌ హత్యపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అత్యంత కిరాతకంగా జరిగిన ఆమె హత్యపై పాత్రికేయ లోకం భగ్గుమంటోంది. ఆమెను కాల్చిచంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ దేశవ్యాప్తంగా జర్నలిస్టులు నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు.

    గౌరీలంకేశ్‌ హత్యను ఐండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ (ఐజేయూ) ఖండించింది. గౌరీ హత్య ప్రజాస్వామ్యంపై దాడిగా చూడాలని పేర్కొంది. ఇలాంటి దాడులను జర్నలిస్టులంతా ముక్తకంఠంతో ఖండించాలని ఐజేయూ అధ్యక్షుడు ఎస్‌ఎన్‌ సిన్హా, ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్‌ పిలుపునిచ్చారు.

    గౌరీలంకేశ్‌ హత్యపై ఎడిటర్స్ గిల్డ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిర్భయంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసి.. అసమ్మతి వాదాన్ని వినిపించిన ఆమెను హత్య చేయడమంటే.. భావప్రకటనా స్వేచ్ఛపై కిరాతకంగా దాడిచేయడమేనని ఎడిటర్స్‌ గిల్డ్‌ పేర్కొంది.

మరిన్ని వార్తలు