బలవంతంగా 'మెసెంజర్' అంటగడుతున్న ఫేస్బుక్

29 Jul, 2014 14:42 IST|Sakshi
బలవంతంగా 'మెసెంజర్' అంటగడుతున్న ఫేస్బుక్

మీ స్మార్ట్ఫోన్ లేదా ట్యాబ్లో ఫేస్బుక్ యాప్ వాడుతున్నారా? అందులో చాటింగ్ చేస్తున్నారా? అయితే త్వరలోనే మీరు తప్పనిసరిగా బలవంతంగా అయినా సరే మెసెంజర్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిందే. యూరప్లో ఉన్న యూజర్లు ఇప్పటికే ఈ మెసెంజర్ ఉపయోగిస్తున్నారని, త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా దీన్ని తప్పనిసరి చేస్తున్నారని టెక్క్రంచ్లో వచ్చిన ఓ కథనం తెలిపింది. ఈ విషయాన్ని ఫేస్బుక్ తన అధికారిక ప్రకటన ద్వారా అందరికీ చెప్పింది. ''రాబోయే కొన్ని రోజుల్లో, ఫేస్బుక్ నుంచి మెసేజిలు పంపాలన్నా, అందుకోవాలన్నా తప్పనిసరిగా మెసెంజర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సిందేనని మేం మరింతమందికి త్వరలోనే నోటిఫై చేయబోతున్నాం'' అని ఫేస్బుక్ నుంచి వెలువడిన అధికారిక ప్రకటన తెలిపింది.

ఇన్నాళ్లబట్టి ఫేస్బుక్ యాప్లో ఉన్న మెసేజెస్ ట్యాబ్ నుంచే చాటింగ్ చేసుకునే అవకాశం ఉంటోంది. ప్రత్యేకంగా ఫేస్బుక్ మెసెంజర్ ఉపయోగించాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ కొత్త నిబంధన ప్రకారం బలవంతంగానైనా మెసెంజర్ను డౌన్లోడ్ చేయిస్తున్నారు. దాంతో స్మార్ట్ఫోన్లలో ఉండే మెమరీ మరింత తగ్గిపోనుంది. ఫేస్బుక్లో చాటింగ్ ఇటీవలి కాలంలో అందరికీ బాగా అలవాటైపోయింది. కేవలం స్మార్ట్ఫోన్లలోనే కాక, డెస్క్టాప్, ల్యాప్టాప్, చివరకు విండోస్ ఫోన్లో ఫేస్బుక్ను వాడుతున్నా సరే..ఈ మెసెంజర్ వాడకం తప్పనిసరట.

మరిన్ని వార్తలు