ఆర్మీ దాడిలో నలుగురు మిలిటెంట్లు మృతి

20 Sep, 2014 15:23 IST|Sakshi

శ్రీనగర్:భారత నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద చొరబడేందుకు యత్నించిన నలుగురు మిలిటెంట్లను హతమార్చినట్లు భద్రతా దళాలు స్పష్టం చేశాయి.  తంగథర్ ప్రాంతం నుంచి భారీ స్థాయిలో మిలిటెంట్లు చొరబాటుకు యత్నించే క్రమంలో భారత జవాన్లు వారిని తిప్పికొట్టారని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. శనివారం ఉదయం ఆర్మీకి సవాల్ విసిరిన మిలిటెంట్లు ఒక్కసారిగా కాల్పులకు ఒడిగట్టారు. ఈ క్రమంలోనే భారత జవాన్లు ఎదురుదాడి చేసి నలుగురు మిలిటెంట్లను హతమార్చారు. వారి వద్ద నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.

 

ఆర్మీ దళాలు వరద బాధితులకు సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న సమయంలో మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారన్నారు. దాదాపు 15 మంది మిలిటెంట్లు జవాన్లపైకి కాల్పులు జరిపారని.. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలను బంధించడంతో మిగతా మిలిటెంట్లు తప్పించుకోలేరని పోలీస్ అధికారి తెలిపారు.

మరిన్ని వార్తలు