'బెంగళూరు తరహాలో నిమజ్జనం చేయాలి'

17 Aug, 2015 12:18 IST|Sakshi

హైదరాబాద్ : హుస్సేన్ సాగర్లో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. బెంగళూరు తరహాలో విగ్రహాలను నిమజ్జనం చేయాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని కోర్టు ఈ సందర్భంగా జీహెచ్ఎంసీని ఆదేశించింది.

తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది. వినాయక చవితి  అనంతరం ప్రతి ఏడాది హుస్సేన్ సాగర్లో వేలాది విగ్రహాలను నిమజ్జనం చేస్తున్న విషయం తెలిసిందే.  బెంగళూరులో లోతుగా తవ్విన గుంతల్లో నీళ్లను నింపి అందులో విగ్రహాలను నిమజ్జం చేస్తుంటారు. అయితే ఈ విధానంపై హిందు సాంప్రదాయవాదులు వ్యతిరేకిస్తున్నారు.

మరిన్ని వార్తలు