ఈ కార్ల ధరలు పెరుగుతున్నాయ్!

20 Dec, 2016 20:28 IST|Sakshi
ఈ కార్ల ధరలు పెరుగుతున్నాయ్!

న్యూఢిల్లీ: వరుసగా వాహన కంపెనీలు వాహనాల ధరలను  పెంచేస్తున్నాయి. కార్ల దిగ్గజం జనరల్ మోటార్స్ ఇండియా  తమ కార్ల ధరలను పెంచుతున్నట్టు మంగళవారం  ప్రకటించింది.   పెరిగిన  ఇన్పుట్  ఖర్చులు, కరెన్సీ హెచ్చుతగ్గులు  కారణంగా   ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. ప్రతికూల పరిస్థితుల  ప్రభావంతో వచ్చే నెల  2017 జనవరి నుంచి తన వాహనాల ధరలను రూ.30,000 వరకు పెంచుతున్నట్లు తెలిపింది..

జనవరి 1, 2017 నుంచి  1-2 శాతం ధరలు పెరగనున్నాయని, ఇది ఉత్పత్తి మరియు వేరియంట్లపై ఆధారపడి ఉంటుందని జిఎం ఇండియా  సేల్స్  వైస్ ప్రెసిడెంట్  హర్ దీప్  బ్రార్ ఒక   ప్రకటనలో  చెప్పారు. ముడి పదార్థం ధరల పెరుగుదలతో ఉత్పాదక వ్యయం గణనీయంగా పెరిగిందనీ, ఫారిన్ ఎక్స్ఛేంజ్ రేటు , అత్యధిక ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల కారణాల రీత్యా ధరలు పెంపు తప్పనిసరి అయిందన్నారు.

కాగా దాదాపు అన్ని కంపెనీలు వచ్చే జనవరి నుంచి తమ వాహనాల ధరలను పెంచనున్నట్టు ఇటీవల  ప్రకటించాయి.  హ్యుందాయ్ మోటార్స్, టాటా  మోటార్స్, టయోటా, నిస్సాన్, బెంజ్  సహా అనేక కంపెనీల కార్ల ధరలు పెరగనున్న సంగతి తెలిసిందే.
 

మరిన్ని వార్తలు