'ఆ ప్రభుత్వం విధుల్లో జోక్యం సరికాదు'

23 May, 2015 11:34 IST|Sakshi

న్యూఢిల్లీ: ఒకసారి ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాక మరొకరు ఆ ప్రభుత్వం విధుల్లో జోక్యం చేసుకోవడం సరికాదని రాజ్యాంగ నిపుణుడు గోపాల్ సుబ్రహ్మణ్యం అన్నారు. కేంద్రం, ఢిల్లీ సర్కార్ మధ్య విభేదాలపై ఆయన శనివారం స్పందించారు. ప్రజాస్వామ్య దేశంలో ఇదొక ప్రాథమిక అవగాహనగా గోపాల్ పేర్కొన్నారు.

మంత్రి మండలి నిర్ణయాలు తీసుకుంటుంది, విధానాలు నిర్ణయిస్తుందనీ చెప్పారు. దీన్ని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఐఏఎస్ల నియామకాల్లో జోక్యం చేసుకునే అధికారం కేంద్రానికి ఉండదని చెప్పారు. ఢిల్లీ సీఎంను నియమించేది లెఫ్టినెంట్ గవర్నర్ కాదని, రాష్ట్రపతి' అని తెలిపారు. ఢిల్లీ సీఎంకు రాజ్యాంగం కల్పించిన హోదా విస్తృతమైనది, దీన్ని విస్మరించలేమని గోపాల్ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు