ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

16 Aug, 2015 02:36 IST|Sakshi
ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

కలాంకు పలువురు నేతల నివాళి
న్యూఢిల్లీ: 69వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని శనివారం ప్రజలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. త్రివర్ణ పతాకాలు ఎగరేసి, దేశభక్తి గీతాలు ఆలపించి స్వాతంత్య్ర సమరయోధుల సేవలను గుర్తు చేసుకున్నారు. పలు రాష్ట్రాల రాజధానుల్లో ముఖ్యమంత్రులు జాతీయజెండాలను ఆవిష్కరించి, తమ రాష్ట్రాలను అభివృద్ధి బాట పట్టిస్తామని చెప్పారు. ఉగ్రవాద దాడులను అరికట్టేందుకు భద్రతా సిబ్బంది గట్టి చర్యలు తీసుకోవడంతో వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి.

మావోయిస్టులు ఇచ్చిన బహిష్కరణ  పిలుపును ప్రజలు లెక్కచేయకుండా వేడుకల్లో పాల్గొన్నారు. పాక్ వ్యవస్థాపకుడు జిన్నా ప్రతిపాదించిన ద్విజాతి సిద్ధాంతాన్ని తమ రాష్ట్రం తిరస్కరించిందని జమ్మూ కశ్మీర్ సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయీద్ అన్నారు. కేంద్రం బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆ రాష్ట్ర సీఎం నితీశ్‌కుమార్ డిమాండ్ చేశారు.  
 
ఇస్రో మహిళా శాస్త్రవేత్తకు కలాం అవార్డు
ఇటీవల మరణించిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు కూడా పలువురు నేతలు పంద్రాగస్టు సందర్భంగా నివాళి అర్పించారు. కలాం పేరుతో తమినాడు ఏర్పాటు చేసిన అవార్డును తొలిసారి ఇస్రోకు చెందిన మహిళా శాస్త్రవేత్త ఎన్.వలర్మతికి సీఎం జయలలిత అందజేశారు. అవార్డు కింద స్వర్ణపతకం, రూ.5 లక్షలు ప్రదానం చేశారు.బిహార్‌కు కలాం చేసిన సేవలను ప్రతిబింబించే శకటాన్ని పట్నాలో జరిగిన పరేడ్‌లో ప్రదర్శించారు. దేశ న్యాయవ్యవస్థకు ఉన్న స్వతంత్రతను కాపాడుకోవడానికి జడ్జీలు, న్యాయవాదులు ఏకతాటిపైకి రావాలని భారత ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్. దత్తు

ప్రపంచవ్యాప్తంగా మువ్వన్నెల రెపరెపలు
వాషింగ్టన్: స్వాతంత్య్ర వేడుకలు అమెరికా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లోని భారత ఎంబసీల్లోనూ  ఘనంగా జరిపారు. వందలాది భారతీయులు, వారి స్నేహితులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ఎంబసీలో హైకమిషనర్ టీసీఏ రాఘవన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
 
అమెరికాలో 38వేల మందితో పరేడ్
పంద్రాగస్టు సందర్భంగా అమెరికాలోని ఎడిసన్ నగరంలో 38వేల మందితో నిర్వహించిన భారీ పరేడ్ అందరినీ ఆకట్టుకుంది. రెండు కిలోమీటర్ల పొడవున సాగిన పరేడ్‌లో డజన్ల కొద్దీ బృందాలు మార్చ్‌ఫాస్ట్ నిర్వహించగా, 20 శకటాలను ప్రదర్శించారని ఇండియా వెస్ట్ పత్రిక ఓ కథనంలో తెలిపింది. ఎడిసన్‌లో ప్రారంభమైన ఈ పరేడ్ ఉడ్‌బ్రిడ్జ్ పట్టణం సమీపంలోని ఇండియా స్క్వేర్ వద్ద ముగిసింది. న్యూజెర్సీలోని 100కుపైగా సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఎడిసన్, ఉడ్‌బ్రిడ్జ్ మేయర్లతోపాటు పలువురు భారత ప్రముఖులు ఇందులో పాలుపంచుకున్నారు.

>
మరిన్ని వార్తలు