వైఎస్సార్‌కు నివాళులర్పించిన భట్టి

7 Dec, 2023 12:09 IST|Sakshi

హైదరాబాద్‌: డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న మల్లు భట్టి విక్రమార్క.. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించారు. తన నివాసంలోని పూజ గదిలో ఉన్న వైఎస్‌సార్ చిత్రపటానికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు. వైఎస్‌సార్‌పై తనకున్న అభిమానాన్ని భట్టి చాటుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.

తెలంగాణలో నేడు ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. రేవంత్ రెడ్డి సీఎంగా పదవి చేపట్టనున్నారు. మంత్రులుగా భట్టి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్‌, రాజనర్సింహ, పొంగులేటి, తుమ్మల, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖతో సహా మొత్తం 11 మంది మంత్రి పదవులకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దలు సోనియాగాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. 

ఇదీ చదవండి: ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆర్థిక శాఖ?

>
మరిన్ని వార్తలు