జీఎస్టీ విధానం ధరల్ని పెంచేది కాదు

7 Nov, 2016 02:53 IST|Sakshi
జీఎస్టీ విధానం ధరల్ని పెంచేది కాదు

న్యూఢిల్లీ: కొత్తగా అమల్లోకి రాబోతున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ద్రవ్యోల్బణాన్ని పెంచేది కాదని సిటీగ్రూపు అంచనా వేసింది. ఎందుకంటే వినియోగ ధరల సూచీలోని చాలా వరకు ఉత్పత్తులపై కొత్త విధానంలో పన్ను రేటు దాదాపుగా ప్రస్తుత రేట్లకు దరిదాపుల్లోనే ఉండనున్నట్టు తన నివేదికలో తెలిపింది. 5, 12, 18, 28% పన్ను రేట్లను జీఎస్టీ కౌన్సిల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. తక్కువ పన్ను రేటు నిత్యావసర వస్తువులపై, గరిష్ట పన్ను రేటు విలాసవంత, సిగరెట్‌వంటి ఉత్పత్తులపై విధించాలని కౌన్సిల్‌లో అంగీకారం కుదిరింది. వినియోగ ధరల సూచీ లోని సగం ఉత్పత్తులు, ఆహార ధాన్యాలు పన్ను పరిధిలోకి రావని, పొగాకు, పాన్‌మసాలా, ఏరేటెడ్ డ్రింక్స్, లగ్జరీ కార్లపై పన్ను ప్రస్తుతం 28% కంటే ఎక్కువే పన్ను ఉందని, జీఎస్టీలోనూ ఇంతే ఉండనుందని సిటీగ్రూపు పేర్కొంది.

>
మరిన్ని వార్తలు